Site icon NTV Telugu

Mrunal Thakur: అతడితో పిల్లలను కనాలని ఉందంటున్న సీత..

Mrunal

Mrunal

Mrunal Thakur: సీతారామం చిత్తరంతో టాలీవుడ్ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది బాలీవుడ్ కుర్ర బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతామహాలక్ష్మీ గా ప్రిన్సెస్ నూర్జహాన్ గా మృణాల్ నటనకు ఫిదా కానివారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా విజయంతో అమ్మడికి ఒక్కరిగా వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ 30 లోతారక్ సరసన మృణాల్ ను అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడిప్పుడేకేర్ర్ లో ఎదుగుతున్న మృణాల్ కు ప్రేమ, పెళ్లి, పిల్లలు ఎప్పుడు అంటూ ప్రశ్నలు తలెత్తాయి. వాటికి ఆమె తనదైన రీతిలో సమాధానాలిచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మృణాల్ ఎప్పుడు పెళ్లి చేసుకొంటుంది అన్న ప్రశ్న ఎదురయ్యింది.

ఇక దానికి ఆమె సమాధానమిస్తూ ” సమాజంలో ప్రతి మహిళను ఇలాంటి ఒక ప్రశ్న వెంటాడుతోనే ఉంటుంది. మహిళ పెళ్లి, ప్రేమ, పిల్లలు వాటిపైనే సమాజం ఆసక్తి కనపరుస్తోంది. నా విషయంలో నా జీవితాన్ని అర్ధం చేసుకొనే వాడినే నేను పెళ్లి చేసుకుంటాను. నేను ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఆ లైఫ్ అంతా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి లైఫ్ ను అర్ధం చేసుకొని నన్ను ముందుకు నడిపించేవాడినే నేను వివాహం చేసుకుంటాను. అలాంటి వాడితోనే పిల్లలను కంటాను. నిజం చెప్పాలంటే.. నాకు పెళ్లి కన్నా ముందు పిల్లల్ని కనాలని ఉంది. ప్రేమ మీద నాకు మంచి అభిప్రాయం లేదు. జీవితంలో అలాంటి అభిప్రాయం వస్తే ప్రేమ గురించి ఆలోచిస్తాను” అని చెప్పుకొచ్చింది. అయితే సీత మాటలు కొద్దిగా షాక్ ఇచ్చినట్లే ఉన్నా.. 30 ఏళ్ళ వయస్సులో ఏ స్త్రీ కెరీర్ కన్నా పెళ్లి, ప్రేమ, పిల్లలు మీద ఇంట్రెస్ట్ చూపించరు అని చెప్పి కెరీర్ ను బిల్డ్ చేసుకోవాలని సలహా ఇచ్చింది.

Exit mobile version