NTV Telugu Site icon

Mrunal Thakur: మృణాల్‌తో పెట్టుకుంటే బొక్కల్ ఇరుగుతయ్ బిడ్డ.. జర జాగ్రత్త!

Mrunal Thakur

Mrunal Thakur

Mrunal Thakur takes MMA training from Rohit Nair: సినీ రంగంలోకి అడుగుపెట్టి పదేళ్లు అయినా మృణాల్‌ ఠాకూర్‌ `సీతారామం` సినిమాతో మంచి క్రేజ్ సంపాదించింది. తాజాగా మృణాల్‌ ఠాకూర్‌ కఠినమైన మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్‌ అవుతుంది. `సీతారామం` సినిమాతో ఆమె తెలుగులోనే కాదు పాన్‌ ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యింది. ఇప్పటికే తెలుగులో నానితో `హాయ్‌ నాన్న` విజయ్‌ దేవరకొండతో పరశురామ్‌ సినిమాలో నటిస్తున్న ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. మరోవైపు హిందీలో రెండు మూడు సినిమాలు కూడా చేస్తోంది. ఇక మృణాల్‌ ఫర్హాన్‌ అక్తర్‌తో కలిసి `టూఫాన్‌` చిత్రంలో నటించగా బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో ఫర్హాన్‌ బాక్సర్‌గా అలరించాడు. ఆ టైమ్‌లో మృణాల్‌కి కిక్‌ బాక్సింగ్‌పై ఆసక్తి ఏర్పడడంతోకిక్‌ బాక్సింగ్‌లో పంచ్‌లు నేర్చుకుంటుందట.

Unstoppable in OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘’వీజే సన్నీ’’ అన్ స్టాపబుల్

ప్రొఫేషనల్‌ కిక్‌ బాక్సింగ్‌, మిక్స్ డ్ మార్షల్‌ ఆర్ట్స్ ట్రైనర్‌ రోహిత్‌ నాయర్‌ వద్ద మృణాల్‌ ఇందులో శిక్షణ తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ విషయం మీద మృణాల్‌ స్పందిస్తూ, మిక్స్ డ్ మార్షల్‌ ట్రైనింగ్‌ `సెల్ఫీ` సినిమాలో తనకు ఎంతో ఉపయోగపడిందని చెప్పింది. రోహిత్‌ నాయర్‌ వద్ద శిక్షణ తీసుకోవాలంటే చాలా కృషి, అంకిత భావం కావాలని, దీనిపై పూర్తి శ్రద్ధ పెట్టాలని, అప్పుడే సాధ్యమవుతుందని చెప్పుకొచ్చింది. మృణాల్‌ అక్షయ్‌ కుమార్‌ నటించిన `సెల్ఫీ` మూవీలో ఐటెమ్‌ నెంబర్ చేసింది. యాక్షన్‌ సీక్వెన్స్ కూడా చేసిందీ. అయితే ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయడానికి కారణం కొత్త సినిమా కోసమని తెలుస్తుంది. ఇదంతా చూసిన వారంతా మృణాల్‌తో పెట్టుకుంటే బొక్కల్ ఇరుగుతయ్ బిడ్డ.. జర జాగ్రత్త అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Show comments