Mrunal Thakur: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. సీరియల్ నటి నుంచి స్టార్ హీరోయిన్ గా మార్చింది. ఆమె పేరు వినగానే.. ఆ సినిమానే గుర్తొస్తుంది. కెరీర్ మొత్తంలో ఆమెను ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు.. ఆమె ఎవరో కాదు మన సీత. అదేనండీ.. మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకుంది. ఇక ఒకేలాంటి పాత్రలు కాకుండా ఎలాంటి పాత్రలు అయినా చేస్తాను అని చెప్పడానికి విభిన్నమైన కథలలో నటిస్తూ మెప్పిస్తుంది. ఇక సీతారామం సినిమాలో అంత క్లాస్ లుక్ లో కనిపించిన మృణాల్.. లస్ట్ స్టోరీస్ 2 లాంటి బోల్డ్ సిరీస్ లో ఘాటు సీన్స్ లో కనిపించేసరికి అభిమానులు కొద్దిగా అసహనం వ్యక్తం చేశారు. అయితే అలాంటి విమర్శలు పట్టించుకోకుండా ముద్దుగుమ్మ ముందుకు దూసుకెళ్తోంది. ఇక లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో మృణాల్.. కెరీర్ గురించి, లవ్ గురించి, లస్ట్ గురించి చాలా విషయాలను పంచుకుంది. ఇక మృణాల్ కు బ్రేకప్ కూడా అయ్యిందని కూడా చెప్పుకొచ్చింది.
Jani Master: జానీ మాస్టర్ ‘రన్నర్’ గా వస్తున్నాడట.. విన్నర్ అవుతాడా.. ?
“ఇప్పటి తరం హీరో హీరోయిన్లు ప్రత్యేకంగా సీక్రెట్స్ మెయింటైన్ చేయడం లేదు. అలాంటి జనరేషన్ లో నేను పుట్టినందుకు సంతోషిస్తున్నాను. ఇద్దరు సెలబ్రిటీస్ పెళ్లి చేసుకొంటే.. వారు ముందే ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. ఒకరు వేరే రంగానికి చెందినవారు అయితేనే సీక్రెట్స్ దాస్తున్నారు. గతంలో ఈ విషయం గురించి చెప్పడానికి చాలా మంది సెలబ్రిటీలు సంకోచించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు వేరే రంగానికి చెందినవారు అయినా కూడామొహమాటం లేకుండా ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఇక నాకు గతంలో బ్రేకప్ అయ్యిందని చెప్పేశాను. నా లవ్, బ్రేకప్ అన్ని చెప్పేశాను.. అలా చెప్పడం వలన మనసులో ఉన్న బాధ తగ్గుతుంది. చెప్పలేను అనుకున్నవాళ్ళు కూడా మిగతావారు చెప్పడం వలన చెప్పడానికి ముందుకు వస్తున్నారు” అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట గా మారాయి. ఇక మృణాల్ చెప్పిన మాటలు విన్నాక అభిమానులు.. ఏంటీ .. సీతా.. సినిమాలోనే కాదు బయట కూడా బ్రేకప్ అయ్యిందా.. ఎవరా కుర్రాడు..? అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.