మృణాల్ ఠాకూర్… లేటెస్ట్ తెలుగు ఆడియన్స్ క్రష్. సీతారామం సినిమా, హాయ్ నాన్న ప్రమోషనల్ కంటెంట్ మృణాల్ ని యూత్ కి బాగా దగ్గర చేసాయి. హోమ్లీ లుక్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసిన మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త డ్రెస్సులతో ఫోటో షూట్ చేసి ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అందుకే మృణాల్ పేరు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. మృణాల్ మోడరన్ లుక్ లో ఉండే అమ్మాయి… ఆడియన్స్ మాత్రం మృణాల్ ని ట్రెడిషనల్ వేర్ లో చూడాలి అనుకుంటూ ఉంటారు. అందుకే ఈ రెండు విషయాలని బాలన్స్ చేస్తూ మృణాల్ ఇప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ లోనే మోడరన్ గా కనిపించే ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది. సారీలో కూడా గ్లామర్ గా కనిపించే మృణాల్ ఠాకూర్… లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోస్ చూస్తే యూత్ అట్రాక్ట్ అవ్వడం గ్యారెంటీ.
హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అనిపించే రేంజులో ఉన్న మృణాల్ కొత్త ఫోటోలు బయటకి రాగానే కుర్రాళ్లు రీట్వీట్స్ కొడుతూ హల్చల్ చేస్తున్నారు. హాయ్ నాన్న సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది కాబట్టి ఈ సినిమా ప్రమోషన్స్ కంప్లీట్ అయ్యే వరకు మృణాల్ ఫోటోస్ కొత్తకొత్తగా బయటకి వస్తూనే ఉంటాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. నాని-మృణాల్ పెయిర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి హాయ్ నాన్న సినిమా హిట్ అయితే మృణాల్ కి తెలుగులో మరిన్ని మంచి అవకాశాలు రావడం గ్యారెంటీ. రెమ్యునరేషన్ విషయంలో కాస్త జాగ్రత్త పడితే చాలు మృణాల్ తెలుగులో టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోతుంది.
Latest Vibrant clicks of Beautiful #MrunalThakur @mrunal0801 pic.twitter.com/0k8Llg2NPK
— Vamsi Kaka (@vamsikaka) November 15, 2023