తెలుగు తెరపై ‘సీతారామం’ సినిమాతో ఒక పెయింటింగ్ లా కనిపించిన హీరోయిన్ ‘మృణాల్ ఠాకూర్’. డెబ్యుతోనే తన హోమ్లీ లుక్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసిన మృణాల్ ఠాకూర్, ఇప్పుడు మన దగ్గర మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం నాని పక్కన నటిస్తున్న మృణాల్, హిందీ చిత్ర పరిశ్రమలో కూడా బిజీగా ఉంది. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన మృణాల్, కెరీర్ స్టార్ట్ అయ్యింది మరాఠా సినిమాల్లో. రెండు సినిమాలని మరాఠాలో నటించిన మృణాల్, ఆ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అయ్యింది. సూపర్ 30, బాట్ల హౌజ్, ఘోస్ట్ స్టోరీస్, ధమాక సినిమాల్లో హృతిక్ రోషన్, కార్తీక్ ఆర్యన్ లాంటి స్టార్ హీరోల పక్కన నటించింది కానీ ఆశించిన స్థాయిలో స్టార్ హీరోయిన్ ఇమేజ్ మాత్రం రాలేదు. 2014 నుంచి కెరీర్ బండిని ఇలానే లాగిస్తున్న మృణాల్ ఠాకూర్ కి 2022 బాగా కలిసొచ్చింది. లాస్ట్ ఇయర్ ఈ బ్యూటీ రెండు సినిమాలు చేసింది. తెలుగులో ఎంట్రీ ఇస్తూ సితారామం, హిందీలో జెర్సీ రీమేక్. ఈ రెండు సినిమాల్లో సితారామం మూవీ మృణాల్ కి స్టార్ హీరోయిన్ హోదా తెచ్చింది.
హిందీలో జెర్సీ మూవీ మంచి నటిగా గుర్తింపు తెచ్చింది. ఈ జోష్ లో 2023 స్టార్ట్ చేసిన మృణాల్ హిందీలో ‘గుమ్రా’ అనే సినిమా చేస్తుంది. ఆదిత్య కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషన్స్ లో లాస్ట్ ఫేజ్ లో ఉన్న ‘గుమ్రా’ చిత్ర యూనిట్, ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఇందులో మృణాల్ ఠాకూర్ పోలిస్ ఆఫీసర్ గా కనిపించింది. పోలిస్ యూనిఫార్మ్ వేసి మృణాల్ కొత్తగా కనిపిస్తోంది. గుమ్రా కన్నా ముందు రిలీజ్ అయిన ‘సెల్ఫీ’ సినిమాలో మృణాల్ ‘కుడియా నీ తెరి’ సాంగ్ లో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చింది. ఈ సాంగ్ లో మృణాల్ తన హాట్ లుక్స్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఇప్పుడు గుమ్రా ట్రైలర్ లో పోలిస్ ఆఫీసర్ గా కనిపించింది. ట్రెడిషనల్ నుంచి గ్లామర్ లుక్స్ వరకూ ప్రతి షెడ్ ని చూపిస్తున్న మృణాల్ ఠాకూర్ హిందీలో ‘గుమ్రా’ సినిమాతో అయినా సెటిల్ అవుతుందేమో చూడాలి.
Har kahani ke do pehlu hote hain,Sach aur Jhooth; lekin iss kahani ke pehlu hain Gunaah aur Gumraah! 🚨🕯️#Gumraah Trailer Out Now!https://t.co/fNlWFCF11G#AdityaRoyKapur @PintoVedika #VardhanKetkar @RonitBoseRoy @MuradKhetani #BhushanKumar
— Mrunal Thakur (@mrunal0801) March 23, 2023
