మృణాల్ ఠాకూర్… ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సీతారామం సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ మహారాష్ట్ర బ్యూటీ, మొదటి సినిమాతోనే మ్యాజిక్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో సూపర్ 30, బాట్ల హౌజ్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న మృణాల్… అక్కడ అంతగా రాని క్రేజ్ ని తెలుగులో ఒక్క సినిమాతోనే తెచ్చుకుంది. సీతారామం సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి మృణాల్ ఠాకూర్ అతిపెద్ద కారణం. తన యాక్టింగ్, క్యూట్ నెస్ అండ్ అందానికి యూత్ మాత్రమే కాదు ప్రతి సినీ అభిమాని ఫిదా అయ్యాడు. హోమ్లీ లుక్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్ బాలన్స్ లో ఉండే మృణాల్… సినిమాలకి తగ్గట్లు గ్లామర్ గా కనిపిస్తూ ఉంటుంది, సోషల్ మీడియాలో కూడా కొత్త కొత్త గ్లామర్ ఫోటోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. మృణాల్ మోడరన్ లుక్ లో ఉండే అమ్మాయి… ఆడియన్స్ మాత్రం మృణాల్ ని ట్రెడిషనల్ వేర్ లో చూడాలి అనుకుంటూ ఉంటారు. అందుకే మృణాల్ కాస్త గ్లామర్ గా ఏదైనా ఫోటో పోస్ట్ చెయ్యగానే “ఇలాంటి ఫోటోస్ ఎందుకు అండి” అంటూ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసారు అంటూ మృణాల్ ని ఎంత ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.
మృణాల్ సీతారామం సినిమాలోని అమ్మాయిని గుర్తు చేసింది హాయ్ నాన్న సినిమాలో… నాని ముందు నటించి పేరు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. మృణాల్ మాత్రం తన మార్క్ యాక్టింగ్ తో ఎమోషనల్ సీన్స్ లో ఏడిపించేసింది. హాయ్ నాన్న సినిమా చూడగానే మృణాల్ కి అట్రాక్ట్ అవుతారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో మృణాల్ చేసిన పెర్ఫార్మెన్స్ మరికొన్ని రోజులు పాటు గుర్తు పెట్టుకుంటారు. కెరీర్ ని ఇలానే ముందుకి తీసుకోని వెళ్తే మృణాల్ కి తెలుగులో లాంగ్ కెరీర్ ఉంటుంది. హాయ్ నాన్న సినిమాలో కంప్లీట్ స్టాండ్ అవుట్ గా నిలిచిన మృణాల్ ఠాకూర్, గ్లామర్ గా మోడరన్ గా కనిపిస్తూనే ఎక్కడా ఓవర్ డ్రెస్సింగ్ చెయ్యలేదు. చాలా సింపుల్ గా రెగ్యులర్ సిటీలో ఉండే అమ్మాయిలాగే కనిపించింది. ఒక్క బ్లాక్ సారీ కట్టుకున్న సీన్ లో మాత్రం మృణాల్ ని చూసి థియేటర్ మొత్తం రీసౌండ్ వచ్చేలా అరుస్తారు. ఈ సీన్ కి సంబంధించిన ఫోటోస్ అండ్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
