Mrunal Thakur: చావు భయపెడుతోంది.. మృణాల్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrunal Thakur Comments on Death goes Viral: ఒకప్పుడు మరాటి టీవీ సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ అందుతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా సీతారామం అనే సినిమా తెరకెక్కింది. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు ఇతర భాషల ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఆమెకు ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నాని హీరోగా హాయ్ నాన్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ఆమె ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకులకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
Manjummel Boys: తెలుగులో చిరంజీవి, బాలయ్య, బన్నీతో సినిమాలు చేస్తా: డైరెక్టర్ చిదంబరం ఇంటర్వ్యూ
Also Read
- Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న మృణాల్ సెలబ్రిటీలుగా ఉండటం వల్ల వచ్చే లాభనష్టాలపై స్పందించింది. సెలబ్రిటీగా ఉంటే ఈ ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది, నీ వర్క్‌తో సమాజంలో మార్పు తీసుకురావచ్చని ఆమె చెప్పుకొచ్చింది. అదే ఇబ్బందుల గురించి చెప్పాలంటే.. వర్క్‌లో భాగంగా కుటుంబానికి దూరంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని, అవసరమైనప్పుడు కూడా కుటుంబసభ్యుల పక్కన ఉండలేమని ఆమె కామెంట్ చేసింది. కొన్ని సార్లు తనకు కూడా ఒక సాధారణ జీవితాన్ని గడపాలనిపిస్తుందని గ్రామీణ అమ్మాయిలలాగా 20 యేళ్ళున్నప్పుడే పెళ్లి చేసుకుని, పిల్లలను కని, డిన్నర్ కోసం ఎప్పుడో సరదాగా రెస్టారంట్‌కు వెళ్లి రావాలని ఉంటుందని అన్నారు. అయితే తనకు చావు గురించి ఆలోచిస్తే భయంగా ఉంటుందని.. తను చనిపోతే కుటుంబం ఏమైపోతుందా? అని ఎక్కువగా ఆలోచిస్తుంటానని మృణాల్ ఠాకూర్ కామెంట్ చేసింది.
తాజావార్తలు
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!