Dhanush-Mrunal Thakur : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. తమిళ హీరో ధనుష్ తో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తోందని. అప్పుడే పెళ్లి దాకా వెళ్లిపోయింది ఈ ప్రచారం. కొందరు అయితే ఏకంగా పెళ్లి డేట్లు కూడా ఫిక్స్ అంటూ పోస్టులు పెట్టేస్తున్నారు. ఈ ప్రచారం మరీ ఎక్కువ కావడంతో ఎట్టకేలకు మృణాల్ స్పందించింది. ఈ రూమర్లపై ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురవగా నవ్వేసింది. నాకు ధనుష్ మంచి ఫ్రెండ్. అంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. అజయ్ దేవగణ్ కు ధనుష్ క్లోజ్ ఫ్రెండ్. అందుకే సన్ ఆఫ్ సర్దార్-2 మూవీ ఈవెంట్ కు ధనుష్ ను పిలిచాడు.
Read Also : Prabhas : గుడ్ న్యూస్.. ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి ప్రకటన
నేను కూడా అలాగే వెళ్లాను. ఆ ఈవెంట్ లో ఎదరుపడ్డాం కాబట్టి సరదాగా కలుసుకుని మాట్లాడాం. దానిపై కొందరు సోషల్ మీడియాలో రకరకాలుగా రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. మేం కలిసినంత మాత్రాన మా మధ్య ఏదో ఉన్నట్టు కాదు అని తెలిపింది మృణాల్ ఠాకూర్. ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సన్ ఆఫ్ సర్దార్2 ఈవెంట్ లో వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న వీడియోలు, ఫొటోలు వైరల్ కావడంతో ఈ డేటింగ్ రూమర్లు క్రియేట్ అయ్యాయి. పైగా ఇన్ స్టాలో ఇద్దరూ ఒకరినొకరు ఫాలో కావడం మరో పాయింట్. ఇలా లేనిపోని డౌట్లతో ఇన్ని రోజులు సోషల్ మీడియా ఊగిపోయింది. మృణాల్ కామెంట్స్ తో వీటికి ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి.
Read Also : WAR 2 : జూనియర్ ఎన్టీఆర్ చెప్పింది నిజమేనా..?
