Mrunal Thakur in Lust Stories 2: ఒకప్పుడు హిందీ సీరియల్స్ లో నటించి ఆ తరువాత బాలీవుడ్ సినిమాల్లో మెరిసింది మృణాల్ ఠాకూర్. ఇక తెలుగులో హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ‘సీతారామం’ సినిమాలో సీతామహాలక్ష్మీ అలియాస్ నూర్జహాన్ పాత్రలో నటించి మంచి పేరు సంపాదించిన ఆమె ఆ తరువాత సౌత్ లో పాగా వేసే పనిలో పడింది. ఇక ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో కూడా ముందుంది. అంతే కాదు తెలుగులో పద్దతి గల పాత్రలో నటించడంతో ఇప్పటికే నాని, విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం కూడా దక్కించుకుంది. అయితే ఆ ఇమేజ్ కి పూర్తి భిన్నంగా ఈ భామ ఇప్పుడు ఇంటిమేట్ సీన్లలో నటించిన హీరోయిన్ల జాబితాలోకి చేరింది. అసలు విషయం ఏమిటంటే నెట్ ఫ్లిక్స్ లో ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ కి చెందిన రెండో సీజన్ ఈ రోజు నుంచి స్ట్రీమ్ అవుతోంది. ఈ రెండో సీజన్ లో తమన్న, కాజోల్, కొంకణా శర్మతో పాటు మృణాల్ కూడా ఒక ఎపిసోడ్ లో నటించింది.
Bro Teaser: బ్రో టీజర్ వచ్చేసింది.. మామ అల్లుళ్ళు అదరగొట్టేశారు
ఇక ఈ క్రమంలో మృణాల్ ఒక బెడ్ రూమ్ సీన్ లో హాట్ హాట్ గా నటించిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆమె బెడ్ రూమ్ సీన్ లో కొన్ని వీడియోలు కుర్రాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఆమె పేరుతో ట్రెండ్ చేస్తున్నారు. మృణాల్ బెడ్ పై పడుకున్న శృంగార వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్క మృణాల్ మాత్రమే కాదు ఈ సిరీస్ లో తమన్న నటించిన హాట్ హాట్ సీన్లు కూడా ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఐతే, తమన్నా ఇంతకు ముందే జీ కర్డా అనే ఒక వెబ్ సిరీస్ లో ఇంటిమేంట్ సీన్లు చేసింది. మృణాల్ కూడా ఇదే బాటలో పయనించి హాట్ సీన్లలో నటించడంతో ఆమె ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఇక మృణాల్ కి ఇప్పటి వరకున్న ఇమేజ్ కి భిన్నంగా ఆమె ఇమేజ్ ఇప్పుడు మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి “లస్ట్ స్టోరీస్ 2″కి రివ్యూస్ నెగెటివ్ గా వచ్చినా హాట్ సీన్లు మాత్రం సోషల్ మీడియాలో రచ్చ రేపుతున్నాయి.