Mrunal Thakur: సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ సినిమా విజయంతో వరుస అవకాశాలను అందుకున్న మృణాల్ ప్రస్తుతం నాని సరసన హాయ్ నాన్న.. విజయ్ దేవరకొండ సరసన VD13 లో నటిస్తోంది. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబో VD13 తో మరోసారి రిలీస్ అవుతున్న విషయం తెల్సిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మధ్యే మూవీని అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన మేకర్స్ రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు.
Kavin: పెళ్లి పీటలు ఎక్కనున్న ‘దాదా’ హీరో.. వధువు ఎవరంటే.. ?
రీసెంట్‌గా సినిమా టీం అంతా కలిసి లోకేషన్ల వేటను పూర్తి చేశారు. సినిమా లొకేషన్ల రెక్కీ పూర్తయిన సంగతిని మేకర్లు ప్రకటించి.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని అప్డేట్ ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే నేడు మృణాల్ పుట్టినరోజును VD13 టీమ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. సెట్‌లో ఆమె చేత కేక్ కట్ చేయించారు. అనంతరం ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఆ ఫోటోల్లో మృణాల్ నవ్వులు చిందిస్తూ ఉన్నారు. విజయ్ దేవరకొండ లుక్స్ సరికొత్తగా ఉన్నాయి. ఈ ఫోటోల్లో యంగ్ నిర్మాత హన్షిత రెడ్డి, శిరీష్‌లు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో సీత మరో హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.