Mrs. Chatterjee Vs Norway: ఇండియాలో పిల్లలకు కచ్చితంగా తల్లిపాలు మాత్రమే పట్టాలి.. ఇలా చేస్తేనే వారికి పూర్తీ ఆరోగ్యం అందుతుందని భారతీయుల నమ్మకం. కానీ ఇతర దేశాల్లో పిల్లలకు తల్లి పాలు పట్టడం ఏంటో కూడా తెలియదు. అందం తగ్గిపోతుందని, వయస్సు కనిపిస్తుందని పిల్లలకు డబ్బా పాలు పడుతూ ఉంటారు. కొన్ని దేశాల్లో భారతీయులను ఎంత చులకన చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి దేశాల్లో నార్వే ఒకటి. అక్కడ పిల్లలకు తల్లిపాలు పట్టినా.. వారికి చేతితో ముద్దలు కలిపి పెట్టినా తప్పే. అలాంటి కర్కశమైన దేశంలో ఒక భారతీయ తల్లి తన ఇద్దరు బిడ్డల కోసం కోర్టులో ఎలా పోరాడింది.. ఆ దేశాన్ని గడగడలాడించి తన బిడ్డలను ఎలా దక్కించుకొంది అనే కథతో తెరకెక్కుతున్న చిత్రం మిసెస్. ఛటర్జీ వర్సెస్ నార్వే. బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి అషిమా చిబ్బర్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Ram Charan: ఇండియా నుంచి స్వామిమాలలో వెళ్లి.. అక్కడ ఈ డ్రెస్ ఏంటీ.. ఎలా?
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దేబిక ఛటర్జీ అనే మహిళ.. భర్త నార్వేలో పనిచేస్తూ ఉంటాడు. వారికి ఇద్దరు పిల్లలు. చిన్న చిన్నగా డబ్బు కూడబెట్టుకొని నార్వేలో ఒక ఇల్లు కట్టుకుంటారు. ఎంతో ఆనందంగా సాగిపోతున్న ఈ జీవితం పిల్లల కిడ్నాప్ తో అతలాకుతలం అవుతోంది. అయితే అది కిడ్నాప్ కాదని, ఆ పిల్లలకు ఆమె తల్లి నుంచే అపాయం ఉందని అక్కడివారు కేసు వేస్తారు. వారి పిల్లలను ఆమె సరిగ్గా చూసుకోవడం లేదని, తల్లిపాలు పడుతుందని, అన్నం చేతితో తినిపిస్తుందని.. పిల్లలను ఆమె పెంచడానికి వీల్లేదని పిటిషన్ లో ఉంటుంది. నార్వే లో ఉన్న రూల్స్ ప్రకారం పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేసి వారికి 18 ఏళ్ళు వచ్చేవరకు వారిని నార్వే హోమ్స్ పెంచాలని కోర్టు తీర్పునిస్తుంది. ఇక తన పిల్లలను తనవద్దకు తెచ్చుకోవడానికి మిసెస్ ఛటర్జీ చేసిన పోరాటమే ఈ కథ. మిసెస్ ఛటర్జీ గా రాణీ ముఖర్జీ నటించింది అనడం కంటే జీవించింది అని చెప్పాలి. వాస్తవ కథ అని చెప్పి ఇంకా ఈ సినిమా పై ఆసక్తిని క్రియేట్ చేశారు మేకర్స్. నేను మంచి తల్లినా.. చెడ్డ తల్లినా అనేది నాకు తెలియదు.. కానీ నేను తల్లిని అని ఆమె చివర్లో చెప్పిన ఒక్క డైలాగ్ ప్రతి తల్లి హృదయాన్ని చూపిస్తుంది. ఇకపోతే ఈ సినిమా మార్చి 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.