Site icon NTV Telugu

Mr.Pregnant: ఆగస్టు 18న వచ్చేస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’

Mr Pregnant Release Date

Mr Pregnant Release Date

Mr Pregnant seals its release date: ‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ రియాన్ వరుస సినిమాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆయన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాతో వచ్చి ఆకట్టుకున్నాడు. ఇక సోహైల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతోందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక హీరో సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనుండడం హాట్ టాపిక్ అవుతోంది.

Allu Aravind: నేనేదో సరదాగా అంటే లావణ్య మా వాడినే ప్రేమించింది..అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్

ఎందుకంటే ఇప్పటిదాకా తెలుగు తెరపై ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు, ఈ క్రమంలో ఇదొక కొత్త తరహా ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. సినిమా ఔట్ పుట్ విషయంలో చిత్రబృందం సంతృప్తిగా ఉన్నారని, అందుకే రిలీజ్ కు కూడా ఆగస్టు 18 మంచి డేట్ గా భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో వైవిధ్యమైన సినిమాలకు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సక్సెస్ సాధిస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈ సినిమాలో సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ అందిస్తుండగా మైక్ మూవీస్ బ్యానర్పై నిర్మాతలు అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు.

Exit mobile version