AR Rahman: నిన్న రెహమాన్.. నేడు సైరా భాను!
- హాట్ టాపిక్ అవుతున్న రెహమాన్ విడాకులు
- నిన్న లీగల్ నోటీసులు పంపిన రెహమాన్
- నేడు రెహమాన్ భార్య సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన సతీమణి సైరా భాను సుమారు మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించగా రెహమాన్‌ను తప్పుబడుతూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై సైరా భాను స్పందించారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని ఆమె పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ముంబయిలో ఉన్నా< గత కొన్ని నెలలుగా నా ఆరోగ్యం బాగాలేదు, అందుకే ఆయనకు దూరంగా ఉండాలనుకున్నా. యూట్యూబ్, తమిళ మీడియాను ఒక్కటే కోరుతున్నా, దయచేసి ఆయన గురించి ఎలాంటి చెడు ప్రచారం చేయవద్దు. ఆయన చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి, ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. సైరా ఎక్కడికి వెళ్లిందని అందరూ మాట్లాడుకుంటున్నారు కదా ట్రీట్‌మెంట్ కోసం ముంబయి వచ్చానని ఆమె అన్నారు. ఆయన అంటే నాకెంతో ఇష్టం. Divvala Madhuri: పోలీస్ స్టేషన్‌కు దివ్వెల మాధురి.. జనసేన నాయకులపై ఫిర్యాదు
ఆయనకు కూడా నేనంటే ఇష్టం. ఆయనపై విమర్శలు చేయడం ఇకనైనా మానండి, మేము ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. కాబట్టి ఈ క్లిష్ట సమయంలో మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని. త్వరలోనే నేను చెన్నై వస్తా’’ అని ఆమె పేర్కొన్నారు. ఆయన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించవద్దు అని ఆమె కోరారు. ఇక ఏఆర్ రెహమాన్ విడాకుల గురించి తప్పుగా మాట్లాడుతున్న వారిపై సైరా భాను లాయర్ వందనా షా కూడా ఘాటుగా స్పందించారు. నిజానికి AR రెహమాన్ విడాకుల అనంతరం ఆయన వద్ద పని చేసే నుండి బాస్ గిటారిస్ట్ మోహిని డే తన భర్త మార్క్ నుండి విడిపోతున్నట్లు Instagram లో పోస్ట్ చేసింది. మోహిని ఇన్‌స్టా పోస్ట్‌ని చూసి, కొందరు ఆమెతో ఏఆర్ రెహమాన్ అఫైర్ పెట్టుకున్నాడని కూడా కామెంట్స్ చేశారు. ఇదే విషయం మీద ఆమె స్పందించారు.
Also Read
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!