Site icon NTV Telugu

Mr Celebrity: ‘మిస్టర్ సెలెబ్రిటీ’ విజయం.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

Mr Celebrity

Mr Celebrity

ప్రస్తుతం టాలీవుడ్‌కి కొత్త దర్శకులు, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త హీరోలు వస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్, కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే చిత్రం వచ్చింది. అక్టోబర్ 4 న విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు మిస్టర్ సెలెబ్రిటీకి థియేటర్ల సంఖ్య కూడా పెంచారని నిర్మాత వెల్లడించారు.

The Great Pre-Wedding Show: కొత్త సినిమా మొదలెట్టిన తిరువీర్

మిస్టర్ సెలెబ్రిటీని ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మించారు. బిజినెస్ రంగంలో ఎంతో బిజీగా ఉన్న పాండు రంగారావు సినిమాల మీద మక్కువతో మిస్టర్ సెలెబ్రిటీని నిర్మించారు. మొదటి చిత్రంతోనే నిర్మాతగా ఆయన తన అభిరుచిని చాటుకున్న ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మిస్టర్ సెలెబ్రిటీని గ్రాండ్‌గా నిర్మించారు. ఇక ఈ సినిమాకు వచ్చిన ఆదరణను చూసి నిర్మాతగా ఆయన సంతోషాన్ని పంచుకున్నారు. దర్శకుడిగా మొదటి చిత్రమే అయినా చందిన రవి కిషోర్‌ను బాగా తీశారని, పరుచూరి సుదర్శన్ తన తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారని అన్నారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పారు. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రకు వస్తున్న రెస్పాన్స్ పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తూ.. అడిగిన వెంటనే పాత్రకు ఓకే చెప్పినందుకు ఆమెకు థాంక్స్ తెలిపారు.

Exit mobile version