Site icon NTV Telugu

Mowgli : మోగ్లీ టీజర్ రిలీజ్.. అదిరిన విజువల్స్

Mogli

Mogli

Mowgli : రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా వస్తున్న సినిమా మోగ్లీ ‘మోగ్లీ 2025’. దీన్ని సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సాక్షి సాగర్‌ మడోల్కర్‌ హీరోయిన్ గా చేస్తోంది. డిసెంబర్ 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. అటవీ ప్రాంత నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా సినిమా ఉందని తెలుస్తోంది. రోషన్ కనకాల లుక్, సాక్షి గ్లామర్ ఆకట్టుకుంటున్నాయి.

Read Also : Prakash Raj : ఆ విషయం తెలియకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశా..

నేను రాముడు, తను నా సీత అని రోషన్ అనగానే.. రావణాసురుడు లేడుగా అని వైవాహర్ష అనగానే విలన్ ఎంట్రీ ఇవన్నీ బాగున్నాయి. అటవీ ప్రాంతానికి తగ్గట్టు విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్ లో యాక్షన్, డైలాగులు, విలన్ ఎంట్రీ తో నింపేశారు. చాలా గ్యాప్ తర్వాత రోషన్ నుంచి వస్తున్న సినిమా. పైగా అటవీ ప్రాంత నేపథ్యం ఉంది కాబట్టి సినిమా మీద ఆసక్తికర చర్చ జరుగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా రోషన్ కొత్త తరహా కథలను ఎంచుకుంటుఎన్న సంగతి మనకు తెలిసిందే కదా.

Read Also : Prakash Raj : ఆ విషయం తెలియకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశా..

Exit mobile version