NTV Telugu Site icon

‘రంగస్థలం’ తమిళ​ ట్రైలర్: చిట్టిబాబు రీసౌండ్ అదిరిపోయిందిగా!

దర్శకుడు సుకుమార్‌, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘రంగస్థలం’. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, అనసూయ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇదిలావుంటే, ‘రంగస్థలం’ తమిళ డబ్బింగ్‌ వెర్షన్‌ ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి పురస్కరించుకొని తాజాగా ‘రంగస్థలం’ తమిళ ట్రైలర్‌ని విడుదల చేశారు. చెవిటి పాత్రకు ప్రాణం పోసిన చిట్టిబాబు తమిళంలో రీ సౌండ్ ఇవ్వబోతున్నారు. తెలుగుతో పోలిస్తే తమిళ రంగస్థలం ట్రైలర్ మరింత కొత్తగా అనిపిస్తోంది. మరి ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.