Site icon NTV Telugu

ఛాలెంజ్ యాక్సెప్టెడ్… నయనతార “నేత్రికన్” ట్రైలర్

Netrikann Trailer, Netrikann, Nayanthara, Vignesh Shivan, Milind Rau,

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం “నేత్రికన్”. ఈ చిత్రంలో అజ్మల్ అమీర్, సరన్, ఇంధుజా, మణికందన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. రౌడీ పిక్చర్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్ లపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. ‘అవల్’ ఫేమ్ గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతాన్ని అందించగా, కెమెరామ్యాన్ గా ఆర్డీ రాజశేఖర్ చేశారు. ఎడిటర్‌గా లారెన్స్ కిషోర్, యాక్షన్ డైరెక్టర్‌గా ధీలిప్ సుబ్బారాయణ్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎస్ కమల్‌నాథన్ ఈ చిత్ర సాంకేతిక సిబ్బందిలో ఒక భాగం. ఆగస్టు 13న “నేత్రికన్”ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Read Also : బిగ్ బాస్ 5… బిగ్ అప్ డేట్!

పోస్టర్ తోనే అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది నయనతార. మిలింద్ రౌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయన్ అంధురాలిగా ఛాలెంజింగ్ రోల్ లో కన్పించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ క్రైమ్ సీన్లతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ప్రతి ఫ్రేమ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ చూస్తుంటే సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Exit mobile version