బిగ్ బాస్ 5… బిగ్ అప్ డేట్!

బిగ్ బాస్ సీజన్ 5కు రంగం సిద్ధమైంది. గత నాలుగు సీజన్స్ ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా వీక్షకులలో కుతూహలాన్ని పెంచుతూ పోయాయి. ఇప్పుడు సీజన్ 5 కూడా అదే స్థాయిలో గత సీజన్స్ టీఆర్పీని క్రాస్ చేసేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఎన్టీయార్ తో మొదలై, నాని చేతుల మీదుగా నాగార్జున భుజస్కందాలపైకి బిగ్ బాస్ షో చేరింది. చివరి మూడు, నాలుగు సీజన్స్ ను కింగ్ నాగార్జునే సమర్థవంతంగా నడిపారు. ఇప్పుడీ ఐదో సీజన్ కు రానా పేరు తొలుత వినపడినా, తాను ‘బిగ్ బాస్’ షో చేయడంలేదని ఆయనే ఖండించడంతో ఆ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడింది. సో…. ముచ్చటగా మూడోసారి కూడా నాగార్జునే బిగ్ బాస్ షో ను నిర్వహిస్తారనే అనిపిస్తోంది. చివరి క్షణంలో మార్పులు చేర్పులు జరిగే చెప్పలేం కానీ ప్రస్తుతానికి మాత్రం నాగ్ కోర్టులోనే బాల్ ఉంది!

Read Also : సూరి బాబు గాడి శ్రీదేవి రాబోతోంది !

ఇదిలా ఉంటే.. లాస్ట్ సీజన్ లో పార్టిసిపెంట్స్ పై కాస్తంత నిరుత్సాహాన్ని వీక్షకులు వ్యక్తం చేశారు. గుర్తింపు ఉన్నవాళ్ళను, క్రేజ్ ఉన్న వారిని బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానించి ఉంటే బాగుండేదనే విమర్శలూ వచ్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి కాస్తంత భారీ పారితోషికమే ఇచ్చి… నలుగురిలో పేరున్న వారినే ఎంపిక చేశారట. లాస్ట్ సీజన్ లో మాదిరి ఎలిమినేషన్స్ విషయంలో లీకులు జరగకుండా మరింత గోప్యతను పాటించేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారట. అలానే బిగ్ బాస్ సీజన్ 5కు సంబంధించిన మరో బిగ్ అప్ డేట్ ఏమిటంటే… ఈ సీజన్ సెప్టెంబర్ 5 నుండి మొదలువుతుందని తెలుస్తోంది. సో… టెలికాస్ట్ కు దాదాపు నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో బిగ్ బాస్ హౌస్ సెట్ పనులూ శరవేగంగా సాగుతున్నాయట.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-