Site icon NTV Telugu

ఆకట్టుకుంటున్న “నవరస” ట్రైలర్

Navarasa Official Trailer Out Now

సౌత్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాంథాలజీ వెబ్ సిరీస్ “నవరస” ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ లో ప్రేమ నుండి మరణం వరకు మొత్తం 9 భావోద్వేగాలను చూపించారు. భయం, ప్రతీకారం, ద్వేషం, గందరగోళం, మోసం, వాంఛ, కోపం, విచారం వంటి ఎమోషన్స్ ను ఆవిష్కరించింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది కథలు చెబుతుండటంతో తమిళ స్టార్స్ కూడా స్మార్ట్ స్క్రీన్స్ పై… చాలా మందే కనిపించబోతున్నారు.

Read Also : మళ్ళీ రాజ్ కుంద్రా కస్టడీ పొడిగింపు

సూర్య, రేవతి, ప్రసన్న, నిత్యా మీనన్, పార్వతి, సిద్ధార్థ్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, విక్రంత్, గౌతమ్ కార్తీక్, సింహా, పూర్ణ, అశోక్ సెల్వన్, ఐశ్వర్య రాజేష్ వంటి నటీనటులు “నవరస”లో భాగమయ్యారు. ఈ వెబ్ సిరీస్ కు ఎ.ఆర్.రహ్మాన్, గిబ్రాన్, డి ఇమ్మాన్, అరుల్ దేవ్, కార్తీక్, రాన్ ఏతాన్, గోవింద్ వసంత, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. సంతోష్ శివన్, బాలసుబ్రమణియం, మనోజ్ పరమహంస, అభినందన్ రామానుజం, శ్రేయాస్ కృష్ణ్ బాబు, విరాజ్ సింగ్ సినిమాటోగ్రఫీ అందించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్ తదితరులు దర్శకత్వం వహిస్తున్నారు. “నవరస” ఆగస్టు 6న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుంది.

Exit mobile version