ఉదయ్‌కుమార్ ముంతా, దేవి శ్రీ, డాక్టర్ భవానీ, రవి.ఎం, రత్న, రుక్మిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “గోల్డ్ మెడల్”. యూకే క్రియేషన్స్ బ్యానర్ పై ఉదయ్ కుమార్ ఎం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆయనే అందిస్తున్నారు. నవీన్ చంద్ర ఎం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… రాజ్ సంగీతం సమకూరుస్తున్నాడు. తాజాగా “గోల్డ్ మెడల్” నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఉదయ్ కుమార్ ముంతా లుక్ ను రివీల్ చేశారు. ఆయన గోల్డ్ కు మెరుగులు దిద్దే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. మీరు కూడా ఈ టీజర్ పై ఓ లుక్కేయండి.