NTV Telugu Site icon

హన్సిక సస్పెన్స్ థ్రిల్లర్ “మహా” టీజర్

Hansika's Maha Trailer Released by Sivakarthikeyan

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ 50 వ చిత్రం “మహా”. సిలంబరసన్, శ్రీకాంత్, సనమ్ శెట్టి, తంబి రామయ్య, కరుణకరన్, మహాత్ రాఘవేంద్ర, సుజిత్ శంకర్, నందిత జెన్నిఫర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు యుఆర్ జమీల్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర సంగీతాన్ని జిబ్రాన్ స్వరపరిచారు, మాడి సినిమాటోగ్రఫీ, జోహన్ అబ్రహం ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఎట్సెటెరా ఎంటర్టైన్మెంట్ పతాకంపై మతి అజగన్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ప్రముఖ కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ టీజర్ ను రిలీజ్ చేసి సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ రిలీజ్ చేశారు.

Read Also : సినిమాటోగ్రఫీ (సవరణ) చట్టం 2021పై సూర్య నిరసన గళం

ఈ టీజర్ చూస్తుంటే సినిమా సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్టు తెలుస్తోంది. టీజర్ చాల మలుపులతో కూడుకుని ఆసక్తికరంగా ఉంది. హన్సిక నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందులో హన్సిక మాజీ ప్రియుడు శింబుతో మరోసారి రొమాన్స్ చేసింది ఈ బ్యూటీ. ఈ చిత్రం గత వేసవిలో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కరోనావైరస్ మహమ్మారి కారణంగా మేకర్స్ విడుదలను వాయిదా వేశారు. ఈ చిత్రం ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో విడుదల కావచ్చని వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన రాలేదు. మీరు కూడా క్రైమ్ థ్రిల్లర్ “మహా” టీజర్ పై ఓ లుక్కేయండి.