Site icon NTV Telugu

ఆకట్టుకుంటున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ గ్లింప్స్

Glimpse Of Lighting Sooribabu from Sridevi Soda Center

సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ నుంచి గ్లింప్స్ కట్ ను రిలీజర్ చేశారు. ఇది ఎంతో ఆసక్తికరంగా ఉందంటున్నారు. ‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ నేటివిటీ మిస్ కాకుండా చూపించాడంటున్నారు. ఇక లైటింగ్ సూరిబాబు రోల్ లో సుధీర్ బాబు సరి కొత్తగా షార్ప్ గా కనిపిస్తున్నాడు. పల్లెటూరి యువకుడిగా కనిపిస్తూ మ్యాచో బాడీతో అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ముఖ్యంగా మణిశర్మ నేపథ్యసంగీతం ఆకట్టుకునేలా సాగింది. ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే హీరోయిన్ ఎవరన్నది ఇంకా రివీల్ చేయకపోవడం గమనార్హం.

Exit mobile version