ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బ్లాక్ విడో’. టైటిల్ రోల్ లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ నటించారు. ‘బ్లాక్ విడో’ అవెంజర్స్ లో ఉన్న సూపర్ హీరోలలో ఒకరు. కేట్ షార్ట్‌లాండ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా జూలై 9న ఇండియాలో భారీ రేంజ్ లో విడుదల కాబోతోంది. తాజాగా ‘బ్లాక్ విడో’ తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ లో డైలాగులు, ముఖ్యంగా ‘బ్లాక్ విడో’ యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. ‘బ్లాక్ విడో’ను ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. సాధారణంగానే మార్వెల్ నుంచి సూపర్ హీరో మూవీ అంటే అంచనాలు మామూలుగా ఉండవు. ఇక అవెంజర్స్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గత ఏడాది ‘అవెంజర్స్ ది ఎండ్ గేమ్’తో ప్రేక్షకులను పలకరించిన మార్వెల్ సంస్థ ఇప్పుడు వరుసగా అందులో ఉన్న సూపర్ హీరోల సోలో మూవీలపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం విడుదల చేసిన ‘బ్లాక్ విడో’ ట్రైలర్ అవెంజర్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ ‘బ్లాక్ విడో’ తెలుగు ట్రైలర్ ను వీక్షించండి.