Site icon NTV Telugu

Divine Message 1: ఇస్కాన్‌పై సుబ్రమణ్యపురం దర్శకుడి “డివైన్ మెసెజ్ 1” !

Divine Message 1 Directed By Santosh jagarlapudi

Divine Message 1 Directed By Santosh jagarlapudi

Movie about ISKCON titled “Divine Message 1” Directed by Santosh Jagarlapudi: ఇప్పుడున్న మీడియమ్స్ లో సినిమా ముఖ్యమైనది. ఏదైనా ఒక విషయాన్ని డీప్ గా చెప్పాలన్నా, ఎక్కువ మందికి తెలిసేలా చెప్పాలన్నా దానికి చాలా మంది సినిమాని మాధ్యమంగా వాడుకోవడం సర్వ సాధారణం అయిపొయింది. అందుకే సినిమా దర్శకులు ఎక్కువగా ఒక మెసేజ్ ని తన సినిమా ద్వారా ప్రేక్షకులకు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదు.వాళ్ల భావాలు సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలిసేలా చెప్పడం కోసం సమాజానికి మంచి చేసే సినిమాలు చూసి మారిన వారు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇస్కాన్ సంస్థ కూడా భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ఈ జనరేషన్ లో ఉన్న వారికి తెలియజేయాలనే ఒకే ఒక ఉద్దేశ్యంతో ఒక సినిమాని రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు.

Hrithik – NTR: డాన్స్‌లో సమ ఉజ్జీల సమరం అంటే ఏంటో చూస్తారు.. గెట్ రెడీ!

అయితే అందు కోసం ముందుగా ఒక షార్ట్ ఫిలిం ని తెరకెక్కించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా, ప్రముఖ దర్శకుడు అయిన ‘సంతోష్ జాగర్లపూడి’కి ఈ షార్ట్ ఫిలిం “డివైన్ మెసేజ్ 1” ని తెరకెక్కించే బాధ్యత అప్పగించారు. ఈ షార్ట్ ఫిలింకి కథ ‘సచినందన్ హరిదాస్’ అందించారు. సీతారాం ప్రభు నేతృత్వంలో హైదరాబాద్ ,అత్తాపూర్ ‘ఇస్కాన్ ‘ఆలయంలో దీనిని చిత్రీకరించారు . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ షార్ట్ ఫిలిం పేరు డివైన్ మెసేజ్ 1 గా నిర్ణయించారు… దీనిని త్వరలోనే అమెజాన్ తో సహా అన్ని ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉంచబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సంతోష్ జాగర్లపూడి సుమంత్ హీరోగా మహేంద్ర గిరి వారాహి అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version