Site icon NTV Telugu

Mouni Roy : అర్ధరాత్రి నా రూమ్ లోకి రావాలని చూశాడు.. ప్రముఖ నటి కామెంట్స్

Mouniroy

Mouniroy

Mouni Roy : మౌనీరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలుగులో కూడా నాగిని అనే సీరియల్ లో విలన్ గా చేసింది. రణ్ బీర్ కపూర్, ఆలియా చేసిన బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టింది. ఆమె తాజాగా నటించిన భూత్నీ సినిమా ప్రమోషన్స్ లో సంచలన విషయం వెల్లడించింది. తన జీవితంలో కూడా దారుణమైన ఘటనను ఎదుర్కున్నట్టు తెలిపింది ఈ భామ. నేను అప్పటలో ఓ సినిమా షూటింగ్ కోసం ఓ విలేజ్ లోని హోటల్ కు వెళ్లాం. అక్కడ నాకు ఓ హోటల్ రూం ఇచ్చారు. ఓ వ్యక్తి నాకు తెలియకుండా నా హోటల్ రూం లాక్ తీసుకున్నాడు.

Read Also : Neha Sharma : ఆహా.. నేహా.. ఆ కళ్ళు.. ఆ హొయలు.. వాహ్ వా..

అర్ధరాత్రి ఆ లాక్ సాయంతో నా రూమ్ లోకి రావాలని తెగ ప్రయత్నించాడు. ఆ టైమ్ కు నేను నా మేనేజర్ తో రూమ్ లోనే ఉన్నాను. అతను అలాగే ప్రయత్నించాడు. మేం గట్టిగా అరిచాం. దాంతో హోటల్ వాళ్లు వచ్చేసరికి అతను వెళ్లిపోయాడు. మేం ఎవరు అని అడగ్గా.. రూమ్ క్లీన్ చేసేవాళ్లు కావచ్చు అంటూ హోటల్ వారు సమాధానం ఇచ్చారు. కానీ ఆ టైమ్ లో వాళ్లు ఎందుకు వస్తారు అంటూ నేను గట్టిగా అడిగాను. అది నా లైఫ్‌ లో నే అత్యంత భయంకరమైన ఘటన’ అంటూ చెప్పుకొచ్చింది.
Read Also :New Rules: మే 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. సామాన్యుల జేబుపై ప్రభావం!

Exit mobile version