Megastar: భోళాశంకరుడి శివ తాండవం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. వింటేజ్ మాస్ అంటే ఎలా ఉంటుందో చూపించిన చిరు నటిస్తున్న నెక్స్ట్ సినిమా ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి భోళాశంకరుడి శివ తాండవం అంటూ ఒక మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మహా శివరాత్రి పండగ సంధర్భంగా బయటకి వచ్చిన ఈ మోషన్ పోస్టర్ లో చిరు ‘డమరుఖం’ పట్టుకోని స్టైలిష్ గెటప్ లో ఉన్నాడు. చిరు ముందు కన్నా యంగ్ గా, ఫిట్ గా కనిపిస్తున్న భోలా శంకర్ మోషన్ పోస్టర్ ని చూసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇటివలే షూట్ చేసిన కలకత్తా సెట్స్ నుంచి ఈ పోస్టర్ బయటకి వదిలినట్లు ఉన్నాడు.
హైదరాబాద్ లో కలకత్తా సెట్ వేసి, చిత్ర యూనిట్ ఒక సాంగ్ ని షూట్ చేశారు. కీర్తి సురేష్ కూడా పాల్గొన్న ఈ సాంగ్ సెట్ ని చూసి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ‘చూడాలని ఉంది’ సినిమా గుర్తొచ్చింది అన్నాడు అంటే ఆర్ట్ వర్క్ ఎంత బాగా చేశారో అర్ధం చేసుకోవచ్చు. భోలా శంకర్ మోషన్ పోస్టర్ లో చిరు లుక్ బాగుండడం ఒకెత్తు అయితే మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకో ఎత్తు. చిరు, మణిశర్మల కాంబినేషన్ అంటే ఇండస్ట్రీ హిట్ సాంగ్స్ గుర్తొస్తాయి, ఇప్పుడు చిరుతో మణిశర్మ కొడుకు జత కలిశాడు. మోషన్ పోస్టర్ చూస్తుంటే మణిశర్మ మ్యాజిక్, మహతి స్వర సాగర్ కూడా క్రియేట్ చేసినట్లే ఉన్నాడు. మరి ఈ మూవీతో మెగాస్టార్ చిరంజీవి మరో హిట్ అందుకుంటాడేమో చూడాలి. తమిళ్ లో అజిత్ నటించిన ‘వేదాలం’ సినిమాకి ‘భోళా శంకర్’ రీమేక్ గా తెరకెక్కుతుంది.
Also Read
- Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు... రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
- RC17 - Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!
- Dorothy Official Teaser : 'డొరోతి' టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
- Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా'.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
భోళాశంకరుడి శివ తాండవం 🤘
అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏🏻Watch #StreakofShankar from #BholaaShankar ❤️🔥
– https://t.co/5qUTcQUpsHA #MahathiSwaraSagar Music🔥
Mega🌟@KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @BholaaShankar @adityamusic pic.twitter.com/u3PUvFfAbM
— AK Entertainments (@AKentsOfficial) February 18, 2023
తాజావార్తలు
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్‌లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!