ఇండియన్ సినీ పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి ఎదిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొద్ది సంవత్సరాలుగా మన టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ మేకర్స్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే, మేకింగ్ పరంగా వందల కోట్ల బడ్జెట్‌తో విజువల్ వండర్స్‌ను తెరకెక్కిస్తున్నారు. అయితే, ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న మరియు అత్యంత ఖరీదైన చిత్రాల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సినిమాల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచి అందరినీ షాక్ కలిగిస్తున్న సినిమా ‘రామాయణ’. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ దృశ్యకావ్యాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఈ రెండు పార్టుల అంచనా బడ్జెట్ ఏకంగా రూ. 4,000 కోట్లు కావడం విశేషం. ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇది ఒక భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది.
ఇక రెండో స్థానంలో దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న వారణాసి 1200 నుంచి 1400 కోట్ల బడ్జెట్ తో ఉండగా ఆ తరువాత పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) నిలిచింది. ఈ సినిమాను సుమారు రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఆ తర్వాతి స్థానంలో దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి అయిన ‘ఆర్ఆర్ఆర్’ ఉంది. ఈ చిత్రం కోసం మేకర్స్ రూ. 550 కోట్లు వెచ్చించారు. ఈ జాబితాలో ప్రభాస్ నటించిన మరో పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush) రూ. 500 – 700 కోట్ల బడ్జెట్‌తో కొనసాగుతుండగా రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన విజువల్ గ్రాండియర్ ‘2.0’ సినిమాకు రూ. 400 – 600 కోట్ల బడ్జెట్ అయింది. అలాగే అల్లు అర్జున్ మాస్ అండ్ బాక్సాఫీస్ వండర్ ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa: The Rule – Part 2) మరియు కింగ్ సినిమా బడ్జెట్లు రూ. 400 – 500 కోట్ల మధ్య ఉన్నాయి. వీటితో పాటు విజయ్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ రూ. 380 – 400 కోట్లు, రణ్‌బీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ’ రూ. 375 – 410 కోట్లు, మరియు రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ రూ. 350 – 425 కోట్ల భారీ బడ్జెట్ చిత్రాలుగా నిలిచాయి. వందల కోట్ల బడ్జెట్‌తో ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ మార్కెట్‌కు చాటుతున్న ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభాసం చూపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు!

