NTV Telugu Site icon

Month Of Madhu Trailer: సెటిల్ మెంట్ దేనికండీ.. ప్రేమించినందుకా..

Swathi

Swathi

Month Of Madhu Trailer: నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మంత్ ఆఫ్ మధు. కృషివ్ ప్రొడక్షన్స్ పై యశ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మునుపెన్నడూ చూడాని ఒక ప్రేమకథగా ఈ సినిమాను మలిచినట్లు ట్రైలర్ ను బట్టి అర్ధమవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి .. భర్త చేసే పనులకు విసిగిపోయి .. కోర్టు లో విడాకులు కావాలని కోరిన కథగా ఈ సినిమా కనిపిస్తుంది.

Nitya Menen: ఛీ..నిన్ను చూస్తుంటే సిగ్గుగా ఉంది.. స్టార్ హీరో వేధింపుల రూమర్స్ పై నిత్యా క్లారిటీ

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. మంజుల కు ఒక్కగానొక్క కూతురు మధుమిత. అమెరికాలో పెరగడం వలన ఆమె ప్రవర్తన అంతా కొద్దిగా వింతగా, ఫాస్ట్ గా ఉంటుంది. ఇక బంధువుల పెళ్లి ఇండియాలో జరుగుతుండడంతో మధును తీసుకొని ఆమె పెళ్ళికి వస్తుంది. ఆ పెళ్లి జరిగే లోపులోనే మధు చేయకూడని పనులన్నీ చేస్తోంది. దీంతో విసిగిపోయిన మంజుల.. మధును తిట్టి మళ్లీ అమెరికాకు వెళ్లిపొమ్మని చెప్తుంది. ఇక దీంతో ఒక్క నెలరోజులు.. తాను ఇండియాలో ఉండి.. బంధాలు.. అనుబంధాల గురించి తెలుసుకుంటానని ప్రాధేయపడడంతో తండ్రి ఓకే అంటాడు. ఇక ఒక రోజు రాత్రి మధు కు.. మరో మధు పరిచయమవుతాడు. తాగుబోతు అయిన అతను.. మధుకు తన కథ చెప్తాడు. హాస్పిటల్ లో పనిచేసే లేఖ(స్వాతి).. మధు( నవీన్ చంద్ర) ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అతనికి ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. తాగడం, గొడవ పడడం, ఇంటికి వచ్చి పెళ్ళాంతో గొడవపడడం మాత్రమే చేస్తూ ఉంటాడు. దీంతో కొన్నేళ్ళకు భర్తపై విసిగిపోయిన లేఖ .. తన భర్త నుంచి విడిపోవడానికి కోర్టులో కేసు వేస్తుంది. ఆ కోర్టు కేసులో లేఖ గెలిచిందా.. ? అసలు మధు ఎందుకు అలా అయ్యాడు. వీరి కథ విన్నాక మధుమిత ఏం చేసింది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ ట్రైలర్ లో స్వాతి నటన అందరిని కట్టిపడేస్తుంది. భర్తను మార్చుకోలేక.. ఎంతగా ప్రేమించిందో.. అంతే బాధను మోస్తూ కోర్టు చుట్టూ తిరిగిన మహిళగాఆమె నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా అక్టోబర్ 6 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.