ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న ప్రముఖ వెబ్ సిరీస్ “మనీ హీస్ట్ సీజన్ 5” వాల్యూమ్ 2 గురించి ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “మనీ హీస్ట్” అభిమానులు కొత్త సీజన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నిర్మాతలకు మాత్రం విడుదలకు ముందే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ కంటే ముందే ఓ పైరసీ సైట్ ద్వారా లీక్ అయ్యింది.
Read Also : వేప రసం లాంటి నిజం… మెల్లగా దిగుతుంది… నెటిజన్ కు డైరెక్టర్ రిప్లై
కాగా ఈ సీజన్ మొదటి భాగం సెప్టెంబర్‌లో విడుదలైంది. దానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మేకర్స్ ఈ సీజన్ పెద్ద హిట్ అవుతుందని అన్నారు. అయితే విడుదలకు ముందు ఇలా లీక్ చాలా నిరాశపరిచింది. సమాచారం ప్రకారం పైరసీ కారణంగా వినోద పరిశ్రమ సంవత్సరానికి 2.8 బిలియన్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. దీనిపై అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ పైరసీ మాత్రం ఆగడం లేదు.
“మనీ హీస్ట్” సీజన్ లో ఇదే చివరిది. ఈ చివరి సీజన్ ఇప్పుడు ఇంగ్లీష్, స్పానిష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రసారం అవుతోంది. అయితే ఇదే సీజన్ ముగింపు కావడం అభిమానులను కాస్త నిరాశ పరిచే విషయమే. అయితే 2023లో విడుదల కానున్న ‘బెర్లిన్’ సిరీస్‌లో దాని స్పిన్-ఆఫ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.