Pranav : మళయాల స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ డేటింగ్ వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆయన యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తో లవ్ లో ఉన్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కానీ వాటిపై ఇరువురూ ఎన్నడూ స్పందించలేదు. కానీ రూమర్లు మాత్రం ఆగట్లేదు. అయితే తాజాగా ఈ రూమర్లపై డైరెక్టర్ అలెప్పీ అష్రఫ్ స్పందించారు. తనకు ఇరువురి కుటుంబాలతో మంచి సంబంధాలు ఉన్నాయని.. ఇరు కుటుంబాలతో దీనిపై మాట్లాడినట్టు చెప్పారు. కల్యాణి తల్లిని తాను అడిగితే.. అలాంటిదేమీ లేదని చెప్పినట్టు స్పష్టం చేశారు.
Read Also : Nani : సుజిత్ తో సినిమా ఉండేది అప్పుడే.. నాని క్లారిటీ..
‘ప్రణవ్ రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే. అయితే కల్యాణితో మాత్రం కాదు. జర్మనీకి చెందిన అమ్మాయితో అతను రిలేషన్ లో ఉన్నాడు’ అంటూ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. 2022లో వచ్చిన హృదయం సినిమాలో ప్రణవ్, కల్యాణి నటించారు. ఆ మూవీ పెద్ద హిట్ అయింది. అప్పటి నుంచే వీరిద్దరి రిలేషన్ వార్తలు వస్తున్నాయి. ప్రణవ్ పనులు ఎప్పుడూ చాలా వింతగానే ఉంటాయి. ఆయన లైఫ్ స్టైల్ చాలా కొత్తగా ఉంటుంది. మొన్ననే స్పెయిన్ లోని ఓ గొర్రెల ఫాంలో కూడా ఉండి వచ్చాడు. అతను వరుసగా సినిమాలు చేస్తూనే తనకు నచ్చిన సింగర్ గా కూడా కొనసాగుతున్నాడు.