Site icon NTV Telugu

Thudarum : జెట్ స్పీడ్ లో మోహన్ లాల్.. తుడరుమ్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

Thudarum

Thudarum

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ సినిమా ఎంపురాన్. యంగ్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పై   కాంట్రవర్సీలోనూ కోట్ల వర్షం కురిపిస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 250 క్రోర్ కలెక్షన్లను క్రాస్ చేసింది. అంతేకాదు 90 ప్లస్ ఇయర్స్ మలయాళ ఇండస్ట్రీ చరిత్రలో హయ్యెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది ఎంపురన్ 2. ఈ రేర్ ఎచీవ్ మెంట్ ఎంజాయ్ చేసేంత టైం కూడా లేకుండా ఫుల్ బిజీగా ఉన్నారు మోహన్ లాల్. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ థియేటర్స్ లో రన్ అవుతోంది.

Also Read : Bollywood : రణబీర్- దీపికా.. వర్కౌట్ అవుతుందా..?

కానీ ఈలోపే తన నెక్ట్స్ సినిమా తుడరుమ్‌ను రిలీజ్ కు ప్రిపేర్ చేస్తున్నారు లాలట్టన్. లూసిఫర్ తర్వాత నెల రోజులు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఆడియన్స్‌ను ఎంటర్ టైనర్ చేసేందుకు వచ్చేస్తున్నారు మోహన్ లాల్. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది తుడరుమ్. యాక్చువల్లీ జనవరి 30నే రిలీజ్ కావాల్సి ఉండగా అనుకోని కారణాల వలన పోస్ట్ పోన్ అయ్యింది. ఆపరేషన్ జావా, సౌదీ వెళ్లాక ఫేం తరుణ్ మూర్తి దర్శకుడు. 15 సంవత్సరాల తర్వాత ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన, మోహన్ లాల్‌  జోడీ కడుతున్నారు. తుడరుమ్‌లో మోహన్ లాల్ మరోసారి ఫ్యామిలీ మెన్‌గా కనిపించబోతున్నారు. కార్ డ్రైవర్ రోల్ లో కన్పించబోతున్నాడు. దృశ్యం తరహాలో ఫ్యామిలీ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమ ట్రైలర్ తోనే హైప్ పెంచేసింది.  షార్ట్ గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తున్నమోహన్ లాల్ తుడరుమ్ తో ఎన్ని కోట్లు కొల్లగొడతాడో చూడాలి.

Exit mobile version