Site icon NTV Telugu

Mohan Lal : మోహన్ లాల్ కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు

Mohanlal

Mohanlal

Mohan Lal : మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు లభించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ విషయాన్ని శనివారం సాయంత్రం ఎక్స్ వేదికగా ప్రకటించింది. మోహన్ లాల్ సినీ రంగానికి చేసిన సేవలకు 2023 సంవత్సరానికి ఆయన దాదా సాహేబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయినట్టు వివరించింది. సినీ రంగంలో మోహన్ లాల్ నటుడుగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఎన్నో సేవలు అందించారని.. ఆయన సేవలు సినీ రంగ చరత్రిలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవని ఎక్స్ లో రాసుకొచ్చింది.

Read Also : Kanthara-1 : రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా కాంతార-1 ట్రైలర్..

సెప్టెంబరు 23న జరిగే 71వ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో మోహన్‌లాల్‌ ఈ అవార్డును అందుకోనున్నారు. దీంతో మోహన్ లాల్ కు అభిమానులు, సినీ రంగ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. మోహన్ లాల్ మలయాళంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తెలుగులో కూడా ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సౌత్ లో వైవిధ్యభరిత పాత్రలకు ఆయన పెట్టింది పేరు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర సమాచార ప్రసారశాఖ ఆయన్ను అవార్డుకు ఎంపిక చేసింది.

Read Also : Nagarjuna : అలై బలైకు రండి.. నాగార్జునకు దత్తాత్రేయ ఆహ్వానం..

Exit mobile version