NTV Telugu Site icon

Mohan Lal : ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తున్న మోహన్ లాల్ బిగ్గెస్ట్ డిజాస్టర్

Mohanlal

Mohanlal

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్  దర్శకత్వంలో తానే హీరోగా నటించిన సినిమా బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్.  దాదాపు మూడేళ్ళుగా షూటింగ్ చేసుకున్న ఈ సినిమా గతేడాది డిసెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. 3డిలో తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్‌లాల్ శతాబ్దాలుగా వాస్కోడిగామా దాచిన నిధిని కాపాడుతున్న బరోజ్ అనే జెనీ పాత్రలో కనిపించాడు. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ తో పాటు హిందీ భాషలలో ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా తోలి ఆట నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

Also Read : Anil RaviPudi : అనిల్ రావిపూడి – మెగాస్టార్ ఈ ఏడాది లేనట్టే..?

అయితే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. విడుదలకు ముందే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. మోహన్ లాల్ తోలి డైరెక్షనల్ డెబ్యూట్ కావడంతో హిట్ అవుతుందని భావించిన హాట్ స్టార్ కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు తీసుకువస్తుంది. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూరు అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్ లీడ్ రోల్స్ లో నటించగా మాయ, సీజర్ లోరెంటే రాటన్, కల్లిర్రోయ్ టిజియాఫెటా, తుహిన్ మీనన్ మరియు గురు సోమసుందరం ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను తెలుగులోను డిజాస్టర్ గా నిలిచింది.