Site icon NTV Telugu

Mohan Babu: ఇళయరాజాను పరామర్శించిన మోహన్ బాబు..

Mohan

Mohan

Mohan Babu: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ఇళయరాజా కుమార్తె 47 ఏళ్ల భవతరిణి క్యాన్సర్ తో పోరాడుతూ శ్రీలంకలో కన్నుమూయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆమె మరణంతో ఇళయరాజా తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఇక కూతురు మరణాన్ని తట్టుకోలేక మ్యూజిక్ మ్యాస్ట్రో కొన్నిరోజులు తన ప్రాజెక్ట్స్ మొత్తాన్ని స్టాప్ చేశారు. ఇక ఇళయరాజాను పరామర్శించడానికి తెలుగు, తమిళ్ సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్తున్నారు. తాజాగా మంచు మోహన్ బాబు.. భార్యతో సహా ఇళయరాజా ఇంటికి వెళ్లి.. ఆయనను పరామర్శించారు. ఇక ఈ ఫోటోలను మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

“హృదయ విదారక వార్త విన్న వెంటనే నేను ఇళయరాజాని పరామర్శించాను. కుమార్తె భవతరిణి మరణంతో విషాదంలో మునిగిపోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ విషాద క్షణాన్ని తట్టుకునే శక్తిని కుటుంబానికి ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మోహన్ బాబు – ఇళయరాజా మంచి స్నేహితులు. మంచు లక్ష్మీ నటించిన గుండెల్లో గోదారి సినిమాకు ఇళయరాజానే మ్యూజిక్ అందించారు. అందులో ఎంతో ఫేమస్ అయిన నను నీతో సాంగ్ పాడింది భవతారిణినే. మొదటి నుంచి కూడా మోహన్ బాబు- ఇళయరాజా మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. ఇక భవతారిణి కూడా మోహన్ బాబు కుటుంబంతో మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది.

Exit mobile version