Site icon NTV Telugu

Mohan Lal : మోహన్ లాల్ గొప్ప నిర్ణయం.. ఆ పిల్లలకోసం..

Mohanlal

Mohanlal

Mohan Lal : మలయాళ సూపర స్టార్ మోహన్ లాల్ పుట్టిన రోజు నేడు. 1960 మే 21న జన్మించిన మోహన్ లాల్ నేడు 65వ బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నాడు. మలయాళ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరో అంటే ఆయనే. ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి దాదాపు 400 సినిమాల్లో నటించారు. ఇప్పటికీ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అలాగే ఇతర భాషల అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ.. వారికి ఏ మాత్రం తీసిపోకుండా అద్భుతంగా నటిస్తూ మెప్పిస్తున్నాడు. అలాంటి మోహన్ లాల్ పుట్టిన రోజు సందర్భంగా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఆయన గతంలో విశ్వశాంతి ఫౌండేషన్ ను ప్రారంభించాడు.

Read Also : Mahesh Babu : మేడమ్ టుస్సాడ్స్.. మహేశ్ కు మాత్రమే ఆ రికార్డు సొంతం..

నేడు బర్త్ డే కానుకగా.. ఈ ఫౌండేషన్ ద్వారా నిరుపేద పిల్లలకు అతి తక్కువ ధరలే కాలేయ మార్పిడి ఆపరేషన్లు చేయిస్తానని ప్రకటించాడు. కేరళలో చాలా మంది చిన్న పిల్లలు కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని.. వారిలో చాలా మందికి ఈ ఆపరేషన్ అవసరం అని మోహన్ లాల్ చెప్పారు. వారందరికీ తాను అండగా ఉంటానన్నాడు. అలాగే తన ఫౌండేషన్ ద్వారా ‘బి ఎ హీరో’ అనే పేరుతో మాదకద్రవ్యాల మీద వ్యతిరేకంగా ప్రచారాన్ని చేస్తామని చెప్పారు. ఇలా తన బర్త్ డే సందర్భంగా రెండు గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు మోహన్ లాల్. ఆయన 2015లో ఈ విశ్వశాంతి ఫౌండేషన్ ను ప్రారంభించాడు. అప్పటి నుంచి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు.

Read Also : Kalam : ధనుష్ హీరోగా ‘అబ్దుల్ కలాం’ బయోపిక్..

Exit mobile version