NTV Telugu Site icon

Vrushabha: మోహన్ లాల్ తో శ్రీకాంత్ కొడుకు మలయాళ ఎంట్రీ.. షూటింగ్ షురూ

Roshan

Roshan

Vrushabha: టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ బంపర్ ఆఫర్ పట్టేశాడు. తెలుగులో పెళ్లిసందD చిత్రంతో హీరోగా పరిచయమైన రోషన్.. హిట్ అయితే అందుకోలేదు కానీ, మంచి నటనను కనపరిచి తండ్రిపేరును నిలబెట్టాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్టున్న రోషన్.. అప్పుడే మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాడు. ఇక మొదటి సినిమానే మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ సినిమాలో ఛాన్స్ పట్టేశాడు. మోహన్ లాల్ హీరోగా నంద కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వృషభ. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహీ పరేఖ్ మెహతా, శోబా కపూర్, ఏక్తా కపూర్, వరుణ్ మాథుర్, మరియు శ్యామ్ సుందర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Suriya: సూర్య పుట్టినరోజున విషాదం.. ఫ్లెక్సీ కడుతూ ఇద్దరు అభిమానులు మృతి

ఇక ఈ సినిమాలో మోహన్ లాల్ సరసన రాగిణి ద్వివేది నటిస్తుండగా.. రోషన్ సరసన.. బాలీవుడ్ హీరో సంజయ్ కపూర్ కుమార్తె సాన్యా కపూర్ నటిస్తుంది. జరా ఖాన్ తో పాటు శ్రీకాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. నిన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాతో రోషన్ కు మంచి గుర్తింపు వస్తుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ పూజ కార్యక్రమంలో శ్రీకాంత్ భార్య ఊహ కూడా పాల్గొంది. ఇంటెన్స్.. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. మోహన్ లాల్ కు కొడుకుగా రోషన్ కనిపించనున్నాడట. మరి ఈ సినిమాతో రోషన్.. మాలీవుడ్ లో ఎలాంటి ఎంట్రీ ఇస్తాడో చూడాలి.

Show comments