NTV Telugu Site icon

Monster Trailer: మంచు లక్ష్మీ కూతురు కిడ్నాప్.. ?

Mohan Lal

Mohan Lal

Monster Trailer: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ మరో క్రైమ్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఇప్పటికే దృశ్యం 3 ను మొదలుపెట్టిన ఈ హీరో తాజాగా మాన్ స్టర్ గా కనిపించబోతున్నాడు. మోహన్ లాల్ కు బిగ్గెస్ట్ హిట్ మన్యం పులి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు వైశాఖ్ ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ” ఒక నేరం చేసిన మహిళ భర్తను, కూతురు మిస్ అయినట్లు అందరూ చెప్పుకుంటున్నారు “అన్న డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది.

ఒక కేసులో నిందితురాలు మంచు లక్ష్మీ.. ఆమెను విచారిస్తుండగా తన కూతురును ఒకతను తనపై దాడి చేసి తీసుకెళ్లినట్లు చెప్పుకొస్తుంది. వాట్ని పేరు లక్కీ సింగ్ అని కూడా చెప్తోంది. అసలు ఈ లక్కీ సింగ్ ఎవరు..? మంచు లక్ష్మీ కూతురును ఎందుకు కిడ్నాప్ చేశాడు.. అసలు మంచు లక్ష్మీ ఏ నేరం చేసింది..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక లక్కీ సింగ్ గా మోహన్ లా కనిపించాడు. పంజాబీ వ్యక్తిగా తలపాగా, ఫుల్ గడ్డంతో మోహన్ లాల్ లుక్ అదిరిపోయింది. ఇక ట్రైలర్ లో ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాటోగ్రఫీ హైలైట్ గా కనిపిస్తున్నాయి. మంచు లక్ష్మీ కి ఇదే తొలి మలయాళ సినిమా.. ఆమె పాత్ర కూడా కీలకమని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో మోహన్ లాల్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.