Site icon NTV Telugu

The Paradise : ‘ది ప్యారడైజ్‌’ నుండి మోహన్ బాబు పవర్ ఫుల్ లుక్ రిలీజ్..

Mohan Babu First Look, The Paradise Movie

Mohan Babu First Look, The Paradise Movie

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా భారీ సినిమా ‘ది ప్యారడైజ్’ . శ్రీకాంత్ ఓడెల్ దర్శకత్వంలో  ప్రేక్షకులు అంతా ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు ఈ మూవీలో.. సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా, మేకర్స్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నాని ఇప్పటికే డేరింగ్ మేకోవర్‌లో ఫ్యాన్స్‌ను షాక్ చేసినట్టే, మోహన్ బాబు కూడా తన కొత్త లుక్‌తో అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. పోస్టర్‌లో ఆయన లుక్, స్టైల్ అందరికీ ఊహించని విధంగా ఉంది. దీన్ని చూసిన తర్వాత, సినిమా లో మోహన్ బాబు పీక్ పెర్ఫార్మెన్స్ కోసం ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Deepika Padukone: ‘ట్రిపుల్ ఎక్స్‌’ సీక్వెల్‌తో.. మరోసారి హాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న దీపికా పదుకొణె

అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణం ఎస్‌ఎల్‌వి సినిమాస్ సంస్థ వహిస్తోంది. వచే ఏడాది మార్చ్ 26న పాన్ వరల్డ్ లెవెల్‌లో విడుదల కానుంది. ఈ చిత్రం నాని, మోహన్ బాబు లుక్, అనిరుధ్ సంగీతం కలిపి ఫ్యాన్స్ కోసం పెద్ద ట్రీట్ గా నిలుస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఫస్ట్ లుక్ పట్ల క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ ఉత్సాహం అసలు అదుపులో ఉండటం లేదు.

Exit mobile version