బొత్స సత్యనారాయణ ఇంటి వివాహ వేడుకలో ఏపీ మంత్రి పేర్ని నానిని తనను కలిశారని, వారి కుటుంబంతో ఉన్న అనుబంధం దృష్ట్యా తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు పిలిచానని, దాన్ని కూడా కొందరు చెత్త నా కొడుకులు రాజకీయం చేశారని సీనియర్ నటుడు, నిర్మాత మోహన్ బాబు మండిపడ్డారు. మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఆయన నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నానితో జరిగిన సమావేశంపై మోహన్ బాబు స్పందించారు.
Read Also : Khiladi : మరో వివాదంలో రవితేజ మూవీ… కేసు నమోదు
”అన్ని పార్టీలలో నాకు స్నేహితులు, సన్నిహితులు ఉన్నారు. బోత్స ఫ్యామిలీ వెడ్డింగ్ పార్టీలో నాని కలవగానే మా ఇంటికి రమ్మని ఆహ్వానించాను. ఆయన మర్నాడు ఉదయం వచ్చారు. కొందరు చెత్త నా కొడుకులు చెత్తగా ఊహించుకుని ఏదో అనుకుంటే ఎలా?” అన్నారు. నాని ఇంటి వచ్చాక అల్పాహారం చేసి, కాసేపు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకున్నామని, సినిమా వాళ్ళు జగన్ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడారని ఈ సందర్భంగా నేను ఎలా అడుగుతాను? అది మర్యాదా?? అని మోహన్ బాబు ప్రశ్నించారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు, గవర్నర్ లు, మేథావులు తన ఇంటికి వస్తుంటారని, వారికి భోజనం పెట్టి సత్కరించడం తనకు అలవాటని, అలానే వారి ఇళ్ళకు తాను వెళతానని, దీనిని చిలవలు పలవలు చేసి రకరకాల భాష్యాలు చెప్పడం సరికాద’ని అన్నారు. సినిమా రంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నందుకు నానికి మంచు విష్ణు ధన్యవాదాలు చెప్పాడని మోహన్ బాబు వివరించారు.
