Site icon NTV Telugu

Son of India: లేడీస్ మధ్య లిప్ లాక్ సీన్స్!

Son-of-India

రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో మోహన్ బాబు నటించి, నిర్మించిన సినిమా ‘సన్ ఆఫ్‌ ఇండియా’. ఈ నెల 18న ఇది విడుదల కాబోతోంది. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి మోహన్ బాబు తెలియచేస్తూ, ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు. ‘ఓ ఎమ్మెల్యే కారణంగా చేయని తప్పుకు జైలుకు వెళ్ళిన ఓ వ్యక్తి, తనలాంటి అమాయకులు దేశ వ్యాప్తంగా జైళ్ళలో ఎంతమంది ఉన్నారనే విషయమై పరిశోధన చేసి, ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడన్నదే ఈ చిత్ర కథ’ అని చెప్పారు.

Read also : Mohan Babu: చెత్త నా కొడుకులు నాని రాకను రాజకీయం చేశారు!

యూత్ కోరుకునే కొన్ని క్రేజీ సీన్స్ ఇందులో ఉన్నాయని, కథానుగుణంగా ఇద్దరు మహిళలు ఒకరిని ఒకరు ముద్దుపెట్టుకోవడం వంటి సన్నివేశాలు ఉంటాయని అన్నారు. వీటిని తొలగించమని నిర్మాతగా తన కొడుకు విష్ణు చెప్పినా తాను వినలేదని, అతన్ని కన్వెన్స్ చేశానని మోహన్ బాబు తెలిపారు. నిజానికి ‘సన్నాఫ్ ఇండియా’ను ఓటీటీ కోసం తీశామని, కానీ కంటెంట్ బాగుండటంతో థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. ఓటీటీ కోసం అన్నట్టుగా కిస్సింగ్ సీన్స్ కాస్తంత ఎక్కువే పెట్టినా, థియేటర్లలో మాత్రం వాటి నిడివిని తగ్గించామని అన్నారు.

Exit mobile version