Site icon NTV Telugu

మెగా హీరోలెవరు పోటీ చేసినా విష్ణు విత్ డ్రా అయ్యేవాడు: మోహన్ బాబు

Mohan Babu Interesting Comments on MAA Elections

మా ఎన్నికల ప్రచారం పోటాపోటీగా నడుస్తోంది. రెండు ప్యానల్స్ సభ్యులు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే మెగాహీరోలు ఎవరు పోటీ చేసి ఉన్నా తన కుమారుడు మంచు విష్ణును పోటీనుంచి తప్పించి ఏకగ్రీవం చేసి ఉండేవాడినని మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చారు. చిరంజీవితో తన స్నేహం ఎల్లప్పుడూ చెక్కుచెదరకుండా ఉంటుందని, పోటీ నుండి విష్ణుని ఉపసంహరించుకోమని చిరంజీవి తనను అడిగాడని వస్తున్న పుకార్లను ధృవీకరించలేనని అంటున్నారు మోహన్ బాబు. ఒకవేళ చిరంజీవి కుమారుడు కానీ నాగబాబు కొడుకు కానీ అల్లు అరవింద్ కుమారుడు కానీ అసలు మెగా కాంపౌండ్ నుండి ఏ హీరో అయినా మా ప్రెసిడెంట్ కోసం పోటీ చేస్తూ చిరంజీవి చేసి ఉంటే విష్ణు నామినేషన్ విత్ డ్రాచేసి ఉండేవాడిని. కానీ ప్రకాష్ రాజ్ కోసం మాత్రం చేయలేను అంటున్నారు మోహన్ బాబు.

Read Also : ‘మా’ ఎలక్షన్స్ : జగన్‌, కేసీఆర్‌, బీజేపీ అంటూ ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version