Mohan Babu : మోహన్ బాబుకు ది ప్యారడైజ్ సినిమాతో మంచి ఛాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత ఓ పెద్ద సినిమాలో ఆయన విలన్ గా నటిస్తున్నారు. ఈ విషయంపై మోహన్ బాబు ఇప్పటికే నానితో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. వాస్తవానికి మోహన్ బాబు నటుడిగా మంచి ట్యాలెంట్ ఉన్న వ్యక్తి. కానీ వ్యక్తిగతంగా ఆయనపై చాలాకాలంగా నెగెటివిటీ పెరిగింది. ఇలాంటి టైమ్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న ప్యారడైజ్ సినిమాలో ఆయన నటించడం వల్ల ఎంతో కొంత నెగెటివిటీ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది నటుడిగా మోహన్ బాబుకు మరో అవకాశం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నటుడిగా క్రేజ్ పెరుగుతుంటే.. వ్యక్తిగత విమర్శలు తగ్గిపోతాయనడంలో సందేహం లేదు.
Read Also : R Narayana Murthy : చిరంజీవి చెప్పిందే నిజం.. ఆర్.నారాయణ మూర్తి రియాక్ట్
ఇప్పుడు మోహన్ బాబుకు కావాల్సింది కూడా ఇదే. ఇన్నేళ్ల కెరీర్ లో మోహన్ బాబు సంపాదించుకున్న పేరు, ప్రఖ్యాతలు కేవలం చిన్న చిన్న విషయాల వల్ల తగ్గిపోవడం అంటే ఎంతైనా ఇబ్బందికరమే. కాబట్టి ఇలా పవర్ ఫుల్ విలన్ పాత్రలు చేసి మళ్లీ తన ఇమేజ్ ను నిర్మించుకునేందుకు మోహన్ బాబుకు ఇదో గొప్ప అవకాశం అనే చెప్పాలి. ఈ సినిమాతో ఆయన నిరూపించుకోవడం ఎలాగూ ఖాయమే. ఎందుకంటే విలన్ పాత్రల్లో మెప్పించడం మోహన్ బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఈ రోజు రిలీజ్ అయిన ఆయన లుక్ కూడా అదుర్స్ అనేలాగే ఉంది. కాబట్టి మోహన్ బాబు మరో రెండు సినిమాలతో గనక ఇలాంటి పాత్రలు పడితే ఆయనకు తిరుగే ఉండదేమో. చూడాలి మరి మోహన్ బాబు ప్యారడైజ్ సినిమాలో ఏ స్థాయిలో ఆకట్టుకుంటారు అనేది.
Read Also : Manchu Manoj : నా వల్లే ఎన్టీఆర్ కు గాయం అయింది.. మనోజ్ కామెంట్స్
