NTV Telugu Site icon

Modi- Akira : మోడీతో అకిరా మాట్లాడింది ఇదే.. అసలు విషయం లీక్ అయిందిగా!

Akira Nandan Modi

Akira Nandan Modi

PM Modi Akira Nandan Conversation Leaked by Renu Desai: ప్రధానమంత్రి మోదీతో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ ఫోటోలు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో అప్పటినుంచి పెద్ద ఎత్తున అకీరా హైట్ గురించి చర్చ జరుగుతుంది. అలాగే మోడీ అకిరాతో ఏం మాట్లాడాడు అనే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో అఖీరా నందన్ తో మోడీ ఫోటోను షేర్ చేసిన రేణు దేశాయ్ అసలు అకిరా తో మోడీ ఏం మాట్లాడారు అనే విషయం మీద క్లారిటీ ఇచ్చారు.

Renu Desai: చెప్పాల్సింది పవన్ కే చెప్పా.. ఇక చెప్పేదేం లేదు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

ఒక నెటిజన్ మేము అకిరా పీఎం మోడీ మధ్య జరిగిన సంభాషణ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నాం. మోడీ గారు అకిరా గురించి ఏదో చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మురిసిపోతున్నారు. అయితే అసలు మోడీ అకీరాతో ఏమన్నారు? ఆ విషయాన్ని అకిరాను అడిగి మా కోసం ఒక వీడియో చేయొచ్చు కదా అని కామెంట్ చేశాడు. దానికి ఆమె స్పందిస్తూ ఇంత హైట్ ఉన్నావ్ కదా బాస్కెట్ బాల్ ఆడడం లేదు ఎందుకు అని అడిగితే అకిరా సిగ్గు పడ్డాడు అని రేణు దేశాయ్ కామెంట్ చేసింది.