NTV Telugu Site icon

MM Keeravani: ‘చిరు’ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కీరవాణి.. ఇక బాక్సులు బద్దలే!

Keeravani Music For Chiranj

Keeravani Music For Chiranj

MM Keeravani roped for Chiranjeevi’s Mulloka Veerudu: వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆయన చేయబోతున్న సినిమాల మీద చాలా శ్రద్ద పెట్టారు. ఇక ప్రస్తుతానికి ఆయన మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత వెంకీ కుడుముల సినిమా అనౌన్స్ చేశారు కానీ దాన్ని పక్కన పెట్టి కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్టతో కలిసి సోషియో ఫాంటసీ సినిమా చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అన్ని భాషల్లో పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఇప్పుడు ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఫిక్స్ అయ్యారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారని తెలుస్తోంది. కీరవాణి ఈ రకమైన సోషియో ఫాంటసీ సబ్జెక్టులు, బడా ప్రాజెక్ట్‌లను హ్యాండిల్ చేయడంలో ఎక్స్ పర్ట్ గా పరిగణించబడుతున్న క్రమంలో ఖచ్చితంగా ఆయన అనుభవం ఈ సినిమాకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.
Adipurush: రావణుడి లుక్‌పై ట్రోలింగ్.. మైండ్ బ్లాకయ్యే సమాధానమిచ్చిన నిర్మాత!
కీరవాణి బింబిసార సినిమాకు కూడా పని చేశారు, సినిమాకు ఆయన అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్, పాటలు మెయిన్ ప్లస్ పాయింట్కి అని చెప్పక తప్పదు. ఇక నిజానికి చిరంజీవి, కీరవాణి కాంబోలో కూడా పలు సూపర్ హిట్ సినిమాలు రావడంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక మరోపక్క చిరంజీవి – వశిష్ఠ ప్రాజెక్ట్‌కి ముల్లోక వీరుడు అనే క్రేజీ టైటిల్‌ని ఖరారు చేసినట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో బింబిసార అనే సోషియో ఫాంటసీ చిత్రంతో సంచలనం సృష్టించిన మల్లిడి వశిష్ఠకు ఆ సినిమాతోనే మంచి పేరు, పాపులారిటీ వచ్చింది. ఇక ఇంత పెద్ద సక్సెస్ తర్వాత కళ్యాణ్ రామ్ తో బింబిసార సీక్వెల్ పై కాన్సంట్రేట్ చేస్తాడని అందరూ అనుకున్నారు. అయితే ఈ యువ దర్శకుడు తన తదుపరి ప్రాజెక్ట్‌ని మెగాస్టార్ చిరంజీవితో సెట్ చేసుకున్నాడు. జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో చిరంజీవి కోసం మల్లిడి వశిష్ట సోషియో ఫాంటసీ కథను రాసుకున్నాడని, అది చిరంజీవికి బాగా నచ్చి ఓకే చెప్పారని చెబుతున్నారు. బహుశా అందుకే ఈ చిత్రానికి ముల్లోక వీరుడు అనే టైటిల్‌ పెట్టారేమో అనే చర్చ జరుగుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు.