NTV Telugu Site icon

Mitraaw Sharma: ‘బిగ్‌బాస్’ నాకు అది నేర్పించింది

Mitraaw Sharma Interview

Mitraaw Sharma Interview

బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో టాప్-5లో నిలిచిన మిత్రా శర్మ ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ బిగ్‌బాస్ జర్నీ తనకు స్పెషల్‌గా అనిపించిందని, ప్రతిఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా బిగ్‌బాస్ జర్నీ చేయాల్సిందేనని అన్నారు. పరిస్థితులు తేడా కొట్టినప్పుడు ఏది తప్పు, ఏది కరెక్ట్? అని ఆలోచించకుండా.. పరిస్థితులకు అనుగుణంగా ఎలా మలచుకోవాలి? ఎలా సర్వైవ్ అవ్వాలి? అనేవి బిగ్‌బాస్ నేర్పించిందని చెప్పింది.

బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ప్రతి క్షణం ఒక పరీక్షలా అనిపించేదని, వాటిని దాటుకొని ముందుకెళ్తేనే ఒక దారి ఏర్పడుతుందని, తాను టాప్-5 దాకా వచ్చానంటే అది ప్రేక్షకుల ప్రేమాభిమానాలే అని మిత్ర తెలిపింది. తనకు నాగార్జున ‘ఓ అమేజింగ్ మిత్ర’ అనే పేరు పెట్టడం తన జీవితంలో జరిగిన స్పెషల్ థింగ్ అని పేర్కొంది. నిజానికి తాను టాప్-5 దాకా వస్తానని అనుకోలేదని, రెండు లేదా మూడో వారానికి బయటకు వచ్చేస్తానని అనిపించిందని చెప్పింది. ఎందుకంటే, లోపలున్న వారు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో మొదట్లో అర్థం కాలేదంది. అయితే, తాను ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతూ రావడంతో, తనకోసం ఓట్లు వేస్తున్న జనాల కోసం ఆడాల్సిందేనన్న కాన్ఫిడెన్స్ పెరిగిందంది.

తనకు హౌస్‌లో ఉన్నంతకాలం అక్కడి నుంచి బయటకు ఎప్పుడెప్పుడు వచ్చేస్తానా? అని తాను అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయని, అయితే ప్రేక్షకులు ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో టాప్-5 దాకా రాగలిగానని మిత్ర పేర్కొంది. తాను టైటిల్ గెలవనందుకు బాధపడట్లేదని, ఇంతదాకా రావడమే చాలా ఆనందంగా ఉందని, తనకు ఓట్లేసి తన జర్నీలో అండగా ఉన్నందుకు ప్రేక్షకులకు మిత్ర మరోసారి ధన్యవాదాలు తెలిపింది.

Show comments