Mitraaw Sharma: ‘బిగ్‌బాస్’ నాకు అది నేర్పించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో టాప్-5లో నిలిచిన మిత్రా శర్మ ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ బిగ్‌బాస్ జర్నీ తనకు స్పెషల్‌గా అనిపించిందని, ప్రతిఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా బిగ్‌బాస్ జర్నీ చేయాల్సిందేనని అన్నారు. పరిస్థితులు తేడా కొట్టినప్పుడు ఏది తప్పు, ఏది కరెక్ట్? అని ఆలోచించకుండా.. పరిస్థితులకు అనుగుణంగా ఎలా మలచుకోవాలి? ఎలా సర్వైవ్ అవ్వాలి? అనేవి బిగ్‌బాస్ నేర్పించిందని చెప్పింది.
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ప్రతి క్షణం ఒక పరీక్షలా అనిపించేదని, వాటిని దాటుకొని ముందుకెళ్తేనే ఒక దారి ఏర్పడుతుందని, తాను టాప్-5 దాకా వచ్చానంటే అది ప్రేక్షకుల ప్రేమాభిమానాలే అని మిత్ర తెలిపింది. తనకు నాగార్జున ‘ఓ అమేజింగ్ మిత్ర’ అనే పేరు పెట్టడం తన జీవితంలో జరిగిన స్పెషల్ థింగ్ అని పేర్కొంది. నిజానికి తాను టాప్-5 దాకా వస్తానని అనుకోలేదని, రెండు లేదా మూడో వారానికి బయటకు వచ్చేస్తానని అనిపించిందని చెప్పింది. ఎందుకంటే, లోపలున్న వారు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో మొదట్లో అర్థం కాలేదంది. అయితే, తాను ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతూ రావడంతో, తనకోసం ఓట్లు వేస్తున్న జనాల కోసం ఆడాల్సిందేనన్న కాన్ఫిడెన్స్ పెరిగిందంది.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తనకు హౌస్‌లో ఉన్నంతకాలం అక్కడి నుంచి బయటకు ఎప్పుడెప్పుడు వచ్చేస్తానా? అని తాను అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయని, అయితే ప్రేక్షకులు ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో టాప్-5 దాకా రాగలిగానని మిత్ర పేర్కొంది. తాను టైటిల్ గెలవనందుకు బాధపడట్లేదని, ఇంతదాకా రావడమే చాలా ఆనందంగా ఉందని, తనకు ఓట్లేసి తన జర్నీలో అండగా ఉన్నందుకు ప్రేక్షకులకు మిత్ర మరోసారి ధన్యవాదాలు తెలిపింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!