MissShettyMrPolishetty: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అంటూ పాడుకుంటున్నారు అనుష్క అభిమానులు. నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క వెండితెరపై కనిపించింది లేదు. బక్కగా ఉన్నా.. బొద్దుగా ఉన్నా స్వీటీ ఎప్పటికి స్వీటీనే.. ఇది ఆమె అభిమానుల మనసులో ఉన్న మాట. చాలా గ్యాప్ తరువాత ఆమె యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమాకు సైన్ చేసింది. మహేష్ బాబు పి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో తెలుగుతెరకు పరిచయమవుతున్నాడు. జాతిరత్నాలు లాంటి చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి.. ఈ చిత్రంలో అనుష్క సరసన నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన అనుష్క పోస్టర్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మొదలైనప్పటినుంచి మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ను అభిమానులు సజిస్ట్ చేస్తూనే ఉన్నారు. అదే పేరును ఖరారు చేసినట్లు ఎప్పటినుంచో వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా మేకర్స్ సైతం అదే టైటిల్ ను ఖరారు చేస్తూ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి టైటిల్ తో పాటు అనుష్క, నవీన్ ల ఫస్ట్ లుక్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేసారు.
Manchu Manoj: మోహన్ బాబు లేకుండానే మనోజ్ రెండో పెళ్లి..?
ఇక ఈ పోస్టర్ లోనే కథ ఉన్నట్లు కనిపిస్తోంది. అనుష్క బ్యాక్ గ్రౌండ్ లండన్ చూపించగా.. నవీన్ బ్యాక్ గ్రౌండ్ హైదరాబాద్ చూపించారు. స్వీటీ చేతిలో హ్యాపీ సింగిల్ అని బుక్ పట్టుకొని నవ్వుతుండగా.. ఇటు పక్క నవీన్ టీ షర్ట్ పై రెడీ టూ మింగిల్ అని రాసి ఉంది. ఇద్దరు ఎంతో స్టైలిష్ గా కనిపించారు. ఈ పోస్టర్ ను బట్టి రిలేషన్ అంటే ఇష్టం లేని మిస్ శెట్టిని.. మిస్టర్ పోలిశెట్టి ఎలా ప్రేమలోకి దింపాడు.. అనేది కథగా తెలుస్తోంది. ముఖ్యంగా స్వీటీ లుక్ ఆకట్టుకొంటుంది. కొంచెం బొద్దుగా కనిపించినా ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో వేసవి కానుకగా రిలీజ్ అవుతున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ చిత్రంతో స్వీటీ ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.
Introducing our most favourite combo; #MissShettyMrPolishetty to you all🤩
Get ready for a Rollercoaster ride of Entertainment this Summer@MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar #KotagiriVenkateswararao @UV_Creations @adityamusic pic.twitter.com/mkG8bWrMnz
— UV Creations (@UV_Creations) March 1, 2023
