Site icon NTV Telugu

ప్రముఖ నటి దారుణ హత్య.. గోనె సంచిలో నగ్నంగా మృతదేహం

raima islam

raima islam

చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బంగ్లాదేశ్ నటి దారుణ హత్యకు గురైంది. ఆ హత్య ఆమె భర్తే చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిము గత వారం రోజుల నుంచి కనిపించడం లేదు. దీంతో ఆమె భర్త షఖావత్ అలీ నోబెల్‌ రెండు రోజుల క్రితం పోలీసులకు తన భార్య మిస్ అయినట్లు ఫిర్యాదు చేశాడు.

దీంతో రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ పోలీసులు రైమా కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. జనవరి 18న ఢాకాలోని కేరానీ గంజ్ బ్రిడ్జి సమీపంలో ఆమె మృతదేహంను కనుగొన్నారు. గోనెసంచిలో కుక్కి నగ్నంగా మృతదేహం ఉన్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. రైమా శరీరంపై కనిపించిన గాయం గుర్తులను బట్టి రెండు రోజుల క్రితం ఆమెను హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అనంతరం హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త షెకావత్ ని అరెస్ట్ చేసి తమదైన రీతిలో ప్రశ్నించగా.. భార్య హత్య కేసులో తానూ కూడా భాగమయ్యినట్లు ఒప్పుకున్నాడు. ఈ హత్యలో తనతో పాటు మరికొందరు కూడా ఉన్నట్లు నిందితుడు తెలుపడంతో వారందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే, రైమా హత్యకు గల కారణాలు ఏంటి..? అనేది తెలియాల్సి ఉంది. ‘బర్తమాన్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన రైమా దాదాపు 25 సినిమాల్లో నటించింది. ఇక 46 ఏళ్ళ వయస్సులో ప్రస్తుతం ఆమె టీవీ ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తూ కనిపించింది. హీరోయిన్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు

Exit mobile version