NTV Telugu Site icon

Mirzapur 3 Trailer: మీర్జాపూర్ 3 ట్రైలర్ వచ్చేసింది..చూశారా?

Mirzapur 3 Trailer

Mirzapur 3 Trailer

Mirzapur 3 Trailer Released : అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క పాపులర్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ షోలో కనిపించే అన్ని పాత్రలను ఇష్టపడే అభిమానులు చాలా మందే ఉన్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఏ సిరీస్ మూడో సీజన్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల, దాని మూడవ సీజన్ విడుదల తేదీని ప్రకటించారు. జూలై 5, 2024న విడుదల కానుందని చెబుతున్న ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది, దీనికి సోషల్ మీడియాలో అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. సీజ‌న్ 2 ముగింపులో మున్నా (దివ్యేందు శర్మ) గుడ్డు (అలీ ఫజల్‌) చేతిలో చ‌నిపోయిన అనంత‌రం మీర్జాపూర్‌ సింహాసనం గుడ్డు కాళ్ళ దగ్గరకు వస్తుంది.

Pushpa 2 : పోస్టుపోన్ కావడానికి అసలు కారణం అదేనా..?

ఈ క్రమంలో ముందు ఖాలీన్ భయ్యా (పంకజ్‌ త్రిపాఠి) చేతిలో ఉన్న మీర్జాపూర్‌ను గుడ్డు ఎలా శాసిస్తాడు? మ‌రోవైపు గుడ్డుని చంపి మీర్జాపూర్‌ను ద‌క్కించుకోవాల‌ని అక్క‌డి లోక‌ల్ గ్యాంగ్స్ ఏం చేశాయి? ఈ క్ర‌మంలోనే గుడ్డు ఏం చేశాడు అనేది సీజ‌న్ 3 స్టోరీ అని ట్రైలర్ లో చెప్పకనే చెప్పారు. ఇక శ్వేతా త్రిపాఠి, అలీ ఫజల్‌, హర్షిత గౌర్‌, విజయవర్మ తదితరులు నటిస్లున్న ఈ వెబ్ సిరీస్‌కు గుర్మీత్‌సింగ్‌, ఆనంద్ అయ్య‌ర్ సంయుక్తంగా దర్శకత్వం వ‌హిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజ‌న్ 3 జూలై 05 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించగా ఎప్పడెప్పుడు వస్తుందా? అని అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు.

Show comments