Site icon NTV Telugu

ప్రభాస్ బర్త్ డే… అభిమానులకు ‘మిర్చి’ ట్రీట్

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే వేడుకకు సంబరాలు ఇప్పటి నుంచే మొదలవుతున్నాయి. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు. ఆ స్పెషల్ డేను స్పెషల్ గా జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే ఆయన బర్త్ డే వేడుకను సోషల్ మీడియాలో సెలెబ్రేట్ చేసుకోవడం కోసం #GlobalPrabhasDay అనే వైరల్ హ్యాష్‌ ట్యాగ్‌ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పుట్టినరోజును మరింత ప్రత్యేకం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 23న ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ “మిర్చీ” స్పెషల్ షోలను ప్రదర్శించబోతున్నారు. భీమవరం, శ్రీకాకుళం, నరసాపురం, అనంతపూర్, హిందూపూర్, నల్గొండ, కాట్రిగుప్పె, ఆదోని, మండవరం, విజయనగరంలోని థియేటర్లలో ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేయబోతున్నారు. “మిర్చి” చిత్రం ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రాల్లో ఒకటి అని చెప్పొచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2013లో విడుదలైంది.

Read also : అఫిషియల్ : “రాధేశ్యామ్” టీజర్ ముహూర్తం ఖరారు

మరోవైపు ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” టీజర్ ను కూడా అదే రోజు రిలీజ్ చేయబోతున్నాం అంటూ మేకర్స్ ఈరోజు ఉదయమే ప్రకటించారు. ఇంకా ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం “సలార్” నుంచి కూడా ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అక్టోబర్ 23న ప్రభాస్ అభిమానుల సందడితో టాలీవుడ్ లో పండగ వాతావరణం నెలకొంటుంది.

Exit mobile version